Nidhhi Agerwal Gets Kicked Out of Her House

Niddhi agerwal forced to vacate her flat

Tiger Shroff Heroine Kicked, Nidhhi Agerwal, Nidhhi Agerwal Homeless, Nidhhi Agerwal Insult, Munna Michael, Munna Michael Actress, Munna Michael, Bollywood Debutante Heroine, Single Actress No Home

Tiger Shroff's Girl Nidhhi Agerwal from Munna Michael thrown out of Mumbai Home. Because she is a 'Single Actress'.

డెబ్యూ హీరోయిన్ ను ఇంటి నుంచి గెంటేశారు

Posted: 05/16/2017 03:45 PM IST
Niddhi agerwal forced to vacate her flat

ఇండస్ట్రీలో నటించేవారికి ఎంత క్రేజ్ ఉంటుందో.. మాములు జనాల దృష్టిలో ఫిమేల్ నటీమణుల పట్ల అంతే చులకన భావన కూడా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు, సైడ్ క్యారెక్టర్లు చేసే వారిని వేరే కోణంలో చూడటం తెలిసిందే. మూవీ మెయిన్ సెంటర్ అయిన ముంబైలోనే ఓ హీరోయిన్ కు ఘోర అవమానం జరిగింది. బలవంతంగా ఆమె ఉంటున్న ఇంటి నుంచి గెంటేశారు.

బెంగళూర్ కు చెందిన నిధి అగర్వాల్ ఓ మోడల్ కమ్ నటి. త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న టైగర్ ష్రాఫ్ తో 'మున్నా మైఖేల్' సినిమాతో ఆరంగ్రేటం చేస్తోంది. బాలీవుడ్ ఛాన్స్ కదా అందుకే దూరంగా ఉంటే మరిన్ని అవకాశాలు మిస్సవుతానన్న భయంతో బాంద్రాలోని ఓ అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అయ్యింది. అయితే గత కొంత కాలంగా ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ హౌసింగ్ సొసైటీ వాళ్లు వేధింపులకు పాల్పడుతూ వస్తుండగా, ఇటీవల ఆమెను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారంట.

ఇందుకు కారణం ఆమె సింగిల్ (అవివాహిత) కావటమే. సింగిల్ గా ఉన్న నటి, మోడల్స్ పై వీరికి చాలా చిన్న చూపు. నేను సింగిల్‌ గా ఉన్నందున ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నానేమోనని సొసైటీ భావిస్తోంది. సినిమా షూటింగ్స్ కారణంగా తాము ఏ సమయానికి ఇంటికి చేరుతామో తెలియదు. దాంతో పొరుగువారికి నచ్చడం లేదు. వారి అనుమానాలను హౌసింగ్ సొసైటీలో కొందరు సమర్థించడంతో... నువ్వు హీరోయిన్ వా?... అయితే అర్ధరాత్రి ఈ రావడాలేంటి? అంటూ అనుమానంగా అడుగుతున్నారు. అంతే కాకుండా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు కూడా అని వాపోయింది. మిగతా ఏరియాల్లో ట్రై చేస్తున్నప్పటికీ అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Munna Michael  Nidhhi Agerwal  Thrown Out  

Other Articles