Ajith Vivegam Movie Teaser Released

Ajith vivegam teaser out

Vivegam Teaser, Ajith New Movie Teaser, Ajith 25 Years carrier, Actor Ajith Kumar New Movie, Ajith 2017 Movie, Ajith Siva New Movie, Ajith Vevegam Teaser, Ajith Teaser, Vivegam New Movie Teaser, Vivegam Teaser Review, Director Siva Vivegam, Vivegam, Vivegam Telugu Title, Vivegam Release Date, Vivegam Actress, Vivegam New Teaser

The teaser of the new Ajith Kumar Movie Vivegam is out. Spy thriller looks enticing and promising.

అజిత్ వివేగమ్ టీజర్ వచ్చేసింది

Posted: 05/11/2017 09:28 AM IST
Ajith vivegam teaser out

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త సినిమా వివేగమ్ టీజర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. రిలీజ్ చేసిన గంటల్లోనే 2 మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది. వీరం ఫేమ్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్ సరసన కాజల్ ఫస్ట్ టైం హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక టీజర్ విషయానికొస్తే.. అజిత్ ను చాలా స్టైలిష్ గా చూపించేశారు. ఓ ఆర్మీ సర్వీస్ మెన్ గా సేవలు అందించిన వ్యక్తిపై టెర్రరిస్ట్ మార్క్ పడటం. దాని వెనక కారణాలు. వాటి నుంచి ఎలా బయటపడ్డాడు. అందుకు కారణమైన వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్న కథనంతో తెరకెక్కినట్లు టీజర్ లో అర్థమౌతోంది. మరోపక్క విజువల్ గా కూడా చాలా రిచ్ గా సినిమాను తీశారు. వివేగమ్(వివేకం) చాలూ ఎంత పెద్ద శత్రువునైనా ఓడించేందుకు అంటూ అజిత్ చెప్పే డైలాగు ఓ స్పై తరహా మైండ్ గేమ్ మూవీ అని చెప్పకనే చెబుతోంది.

 

అక్షర హసన్ సెకండ్ లీడ్ పోషిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. అజిత్ కెరీర్ పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వివేగమ్ ను భారీ ఎత్తున్న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్లు ఉన్నారు. ఆగష్టులో వివేగమ్ తెలుగుతోపాటు తమిళ్ లో కూడా విడుదలకానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith Kumar  Vivegam Teaser  Director Siva  

Other Articles