Kathalo Rajakumari Movie Teaser Released

Kathalo rajakumari new teaser release

Nara Rohith, Kathalo Rajakumari, Kathalo Rajakumari Teaser, Kathalo Rajakumari First Look, Kathalo Rajakumari Love And Revenge, Nara Rohith New Movie Teaser, Nara Rohith Kathalo Rajakumari, Kathalo Rajakumari Teaser Review, Kathalo Rajakumari New Teaser

Kathalo Rajakumari Teaser Released. All about Nara Rohith's Love and Revenge.

నారా రోహిత్ కథలో రాజకుమారి టీజర్ విడుదల

Posted: 05/08/2017 12:23 PM IST
Kathalo rajakumari new teaser release

తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో అంతా ఒక దారి అయితే నారావారబ్బాయి రోహిత్ ది మాత్రం సపరేట్ రూటే. సినిమా సినిమాకు సంబంధం లేకుండా సీరియస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇలా అన్నిరకాల కాన్సెప్ట్ లతో దూసుకుపోతున్నాడు. గతేడాది వరుస సినిమాలతో ఎగబడిపోయిన రోహిత్ ఈ యేడాది 5 నెలలు గడుస్తున్నా ఇంకా ఒక్కటి రిలీజ్ చేయలేదు.

అయితే ఆ మధ్య కథలో రాజకుమారి మూవీ ఫస్ట్ లుక్ లో ఊరమాస్ గెటప్ లో అందరినీ ఆకర్షించిన రోహిత్ ఇప్పుడు టీజర్ ను రిలీజ్ చేశాడు. ఇందులో మాత్రం పూర్తిగా లవర్ బాయ్ గెటప్ లోనే ఉండటం విశేషం. నా ప్రేమ కథ.. మనల్ని ప్రేమించిన వాళ్లపై పగ తీర్చుకోవటం అంటూ సాగే డైలాగులతో చివర్లో నా లవ్ స్టోరీకి నేనే విలన్ అంటూ డైలాగుతో ముగిసింది. సినిమా స్టార్ల మధ్య జరిగే కథ అని స్పష్టంగా తెలుస్తోంది.

 

ఇక సినిమాలో హీరోయిన్ గా నమితాప్రమోద్ తోపాటు నాగశౌర్య, నందితా రాజ్ లు ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు. నారా రోహిత్ స్వీయ బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమాకి మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తుండగా, మెలోడీ మాస్ట్రో ఇళయరాజా, విశాల్ చంద్ర శేఖర్ లు సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Kathalo Rajakumari  Teaser Review  

Other Articles