Baahubali The Conclusion Three Days Collections

Baahubali 2 3 days collections

Baahubali The Conclusion, Baahubali 2 Three Days Collections, Baahubali 2 3 Days Collections, Baahubali 2 400 Crores Collections, Baahubali 2 Collections, Baahubali 2 Weekend Collections, Baahubali 2 Overseas Collections, Baahubali 2 Overseas Weekend Collections, Baahubali-2 3 Days

Baahubali 2: The Conclusion box office collections in opening weekend hit Rs 400-cr high.

బాహుబలి-2.. 3 డేస్ కలెక్షన్లు

Posted: 05/01/2017 02:32 PM IST
Baahubali 2 3 days collections

బాహుబలి 2 ప్రభంజనం నానాటికీ పెరిగిపోతుంది. సాటి తెలుగోడి విజయంగా చిరు, నాగ్ లాంటి సీనియర్ హీరోలతోపాటు యంగ్ జనరేషన్ స్టార్లు, పరభాష నుంచి రజనీకాంత్, శంకర్ తదితరులు జక్కన్నను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక రాజమౌళి రూపొందించిన ఎమోషనల్ విజువల్ వండర్ కు కలెక్షన్లు వరదల్లా పొటెత్తుతున్నాయి. ఏపీలో 6, తెలంగాణలో 5 షోలకు పర్మిట్ ఉండటం, పైగా ఆన్ లైన్ బుకింగ్ ల వీకెండ్ మొత్తానికి టికెట్లు అమ్ముడుపోగా, మే 1 హాలీడే కలిసి రావటం విశేషం. ఇక ఈ మూడు రోజుల్లోనే 400 కోట్ల ఫ్లస్ వసూలు చేసిందనేది విశ్లేషకుల మాట. ఈ లెక్కన పీకే రికార్డును అధిగమించేందుకు ఎంతో టైం పట్టకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గురువారం ప్రిమియర్లతో కలిపి తొలి రోజుకే 4.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసిన ‘బాహుబలి-2’.. శనివారం కూడా అదే జోరు కొనసాగించింది. రెండు రోజుల్లోనే 8.1 మిలియన్ డాలర్లకు బాహుబలి-2 వసూళ్లు చేరుకున్నాయి. ఆదివారం షోలన్నీ అయ్యేసరికి 10 మిలియన్ మార్కును అలవోకగా దాటేసిందీ చిత్రం. ఫైనల్ ఫిగర్స్ పై ఇంకా సమాచారం రావాల్సి ఉంది కానీ.. 10 మిలియన్ మార్కునైతే అందుకున్న సంగతి వాస్తవం. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు 74. 07 కోట్లను రాబట్టింది చిత్రం. ఉత్తరాంధ్రలో రెండు రోజుల్లోనే 7 కోట్లు రాబట్టి సాయి కొర్రపాటికి లాభాలను అందించేందిగా కనిపిస్తోంది.

ఓవర్సీస్ లో 45 కోట్లకు బాహుబలి 2 రైట్స్ అమ్ముడు పోయాయి. ఈ లెక్కన కనీసం 15 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే సక్సెస్ అనిపించుకుంటుంది. మన కరెన్సీలో అయితే ఇది దాదాపు 100 కోట్ల రూపాయలకు సమానం. ఇప్పటికే 10 మిలియన్ వసూలు చేసి హాలీవుడ్ ఛార్ బస్టర్ లిస్ట్ లో 3వ స్థానంలో కొసాగుతున్న బాహుబలికి ఇది అసాధ్యం కాకపోవచ్చు. అయితే తెలుగు వర్షన్ తో పోలిస్తే హిందీ, తమిళ్ వర్షన్ లకు అక్కడ అంతగా ఆదరణ లభించటం లేదు. బాలీవుడ్ లో రెండు రోజుల్లోనే 80 కోట్లు వసూలు చేసి సౌత్ సినిమా సత్తా చాటింది.

భారీ అంచనాలు, అత్యధిక స్క్రీన్లు, ఎక్కువ షోలు.. పాజిటివ్ మౌత్ టాక్ ఇలా అన్ని అవకాశాలు కలిసి రావటంతోనే ఈ ఫీట్ సాధ్యమైందని రాజమౌళి చెబుతున్నాడు. చూస్తుంటే కొద్దిరోజుల్లోనే రూ. 1000 కోట్ల వసూళ్లను దాటే తొలి ఇండియన్ సినిమాగా బాహుబలి ది కంక్లూజన్ కొత్త అధ్యయనం లిఖించేలా కనిపిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ కూడా క్రేజ్ మూలంగా బాహుబలి 2 ను పాక్ లో రిలీజ్ చేయాల్సిందిగా విజ్నప్తి చేస్తున్నప్పటికీ కరణ్ ఆ విషయంలో ప్రతికూలంగా ఉన్నాడంట.

 

Area      3 Days Share      2 Days Share   1st Day Share
Nizam        18.90 Cr            13.72 Cr      8.90 Cr
Ceded      12.63 Cr               9.01 Cr     6.20 Cr
UA            9.01 Cr                6.89 Cr     4.52 Cr
Guntur       8.84 Cr               7.41 Cr      6.18 Cr
East           8.72 Cr                 7.29 Cr     5.93 Cr
West          7.52 Cr               6.73 Cr       6.08 Cr
Krishna         5.25 Cr              3.97 Cr       2.83 Cr
Nellore        3.20 Cr               2.60 Cr        2.10 Cr

Total AP/TG   74.07 Cr           57.62 Cr     42.74 Cr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Weekend Collections  3 days  

Other Articles