Giri Babu sensational comments on Tollywood | స్టార్ హీరోలు చెప్పేవన్నీ అబద్ధాలే.. హిట్ పడితే గాల్లో ఉంటున్నారు:గిరిబాబు.

Giri babu comments on tollywood

Giri Babu Interview, Actor Giribabu, Giribabu Comments, Giribabu Interview, Giribabu New Movies, Giribabu Star Heroes, Giri Babu Shocking Comments, Senior Actor Slam Star Heroes, Senior Actor Giribabu, Giri Babu Family, Giri Babu 2017 Movies, Giribabu Last Movie

Tollywood senior actor Giri Babu sensational comments on Star Heroes. And also slammed young heroes for their attitude.

టాలీవుడ్ పై గిరిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 04/24/2017 10:39 AM IST
Giri babu comments on tollywood

టాలీవుడ్ స్టార్ హీరోలపై నటుడు గిరిబాబు సెన్సేషల్ కామెంట్లు చేశాడు. కళామ తల్లి ముద్దు బిడ్డలం, కేవలం ఇండస్ట్రీకి సేవ చేయటానికి, ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయటానికే వచ్చాం అంటూ కొందరు స్టేజీల మీద స్పీచ్ లు ఇస్తుంటారు. కానీ, వాళ్లు చెప్పేవీ అంతా అబద్ధమంటున్నాడు ఈ సీనియర్ నటుడు అంటున్నాడు.

ఓ ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘పేరు, డబ్బే కదా ఏ మనిషి అయినా కోరుకునేది. సినీ రంగంలోకి ఎవరొచ్చినా వీటి కోసమే వస్తారు తప్పా, కళారాధన కోసమో, కళాసేవ కోసమో, ప్రజాసేవ కోసమో ఎవరూ రారు. ఆ విధంగా ఎవరైనా చెబితే అది శుద్ధ అబద్ధం అని తెలిపాడు. ఇక యంగ్ స్టర్ల గురించి ప్రస్తావిస్తూ.. కొత్తగా వస్తున్న వాళ్లంతా ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆకాశం వైపు చూస్తున్నారని, అది మానుకోవాలని సలహా ఇస్తున్నాడు. చెప్పుడూ మాటలు విని స్టార్లు అయిపోయినట్లు ఊహించుకోవద్దు. అది మంచిది కాదు.

కొందరు రెండు, మూడు సినిమాల్లో నటించిన తర్వాత.. ఆ నటులే కథ చెప్పడం, మార్చడం, డిమాండు చేయడం మొదలుపెడుతున్నారు. మిడిమిడి జ్ఞానంతో, పొగరుతో, మేం పెద్ద హీరోలమైపోయాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో.. పక్కవాళ్లు చెప్పే మాటలు నమ్మి.. తమ జీవితాలను కొత్త నటులు చేతులారా పాడు చేసుకుంటున్నారు’ అని గిరిబాబు ఈ జనరేషన్ పై తన అనాలసిస్ ను చెప్పేశాడు. ఇప్పటికే కోట, సత్యనారాయణ లాంటి సీనియర్లు టాప్ హీరోలతోపాటు కుర్రహీరోలపై కూడా ఇదే స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఫుల్ వీడియో కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Senior Actor  Giri Babu Interview  

Other Articles