తమిళ నటుడు సత్యరాజ్ ఎట్టకేలకు కన్నడ గుడిలకు క్షమాపణలు చెప్పాడు. కొన్నేళ్ల క్రితం కావేరి జల వివాదాల సందర్భంగా కన్నడ ప్రజలను ఉద్దశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఈ సీనియర్ నటుడు. తిరిగి బాహుబలి-2 రిలీజ్ సందర్భంగా ఆ వ్యాఖ్యలను సాకుగా చూపుతూ సినిమాను అడ్డుకుంటామని కొన్ని కన్నడ సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో కలగజేసుకున్న దర్శకుడు రాజమౌళి నిన్న కన్నడ భాషలోనే వాళ్లకు విజ్నప్తి చేశాడు కూడా. అయినా శాంతించని వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో సత్యరాజ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. తామేం సినిమాకో లేక రాజమౌళికో వ్యతిరేకం కాదని, తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన సత్యరాజ్ సారీ చెప్పాల్సిందేనని తేల్చేశారు.
దీంతో రంగంలోకి దిగిన కట్టప్ప అలియాస్ సత్యరాజ్ చివరకు క్షమాపణలు చెప్పేశాడు. నాడు కావేరి ఉద్యమ సమయం సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో కన్నడ నటులు కూడా తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. వారికి కౌంటర్ గానే అలా మాట్లాడాల్సి వచ్చింది. అందుకు క్షమాపణలు అంటూ వీడియోలో తలపైకెత్తి చూడకుండా చదివి వినిపించాడు.
తన వ్యాఖ్యలు సినిమా రిలీజ్ కు అడ్డంకి కారాదన్న సత్యరాజ్, ఈ వివాదానికి ముగింపు పలికి సినిమా రిలీజ్ కానివ్వాలని కన్నడ ప్రజలకు విజ్నప్తి చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. దీంతో వివాదానికి దాదాపుగా తెరపడినట్లే అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Apr 21 | ప్రమమ్ చిత్రంలోనే మంచి నటనాభియనం వున్న నటిగా పేరు సంపాదించిన నటి సాయిపల్లవికి అటు తమిళం ఇటు తెలుగు విపరీతమైన క్రేజ్ వుంది. ఇక ఫిదాలో అమె నటనకు యావత్ తెలుగు ప్రేక్షకుడు ఫిధా... Read more
Apr 21 | టాలీవుడ్ లో పెనుదుమారం రేపిన కాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. మహిళలకు సినీ రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. లీకులు రిలీస్ చేస్తున్న శ్రీరెడ్డి అలియాస్ విమలపై మరో టాలీవుడ్ నటి కరాటే... Read more
Apr 21 | మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపోందుతున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. రాజా ది గ్రేట్ చిత్రం హిట్ అయిన తరువాత మంచి జోరుమీదున్న రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం నేల టిక్కెట్టు, కల్యాణ్... Read more
Apr 17 | టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చ సందర్భ:గా తన భర్త పట్ల, తన పట్లు జుగుప్సాకరమైన అరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్యపై టాలీవుడ్ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్... Read more
Apr 17 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఇందుగలరు.. అందులేరు అన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కనబడు అన్నట్లుగా స్వతహాగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోలుగా వెలుగొందుతున్న వారు కూడా అయన అభిమానులే అనడంలో సందేహం... Read more