సౌత్ బ్యూటీ సమంత ఒళ్లు తగ్గించేందుకు మళ్లీ కసరత్తులు చేస్తోంది. చెర్రీ-సుక్కూ షూటింగ్ లో పాల్గొని తిరిగి హైదరాబాద్ వచ్చిన శామ్ జిమ్ లో తెగ బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలో ఓ ప్రాచీన క్రీడను సాధన చేయటం చర్చనీయాంశంగా మారింది. సిలంబన్ అని పిలుచుకునే ఈ క్రీడ అదేనండీ మన భాషలో కర్రసామును సాధన చేస్తోంది.
అవలీలగా కర్రను తిప్పుతూ అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అన్నట్లు ఈ కొత్త అడిక్షన్ దేని కోసం అంటారా? అక్కడే క్లారిటీ లేకుండా పోయింది. ప్రస్తుతం రాంచరణ్ సినిమాతోపాటు విజయ్ సినిమా లో నటించబోతుంది. ఈ రెండింటిలో దేని కోసం చేస్తుందో ఖచ్ఛితంగా చెప్పలేం కానీ తనకు అలవాటు లేని పనిని శ్రద్ధగా నేర్చుకుంటున్న సమంతను చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నాం.
#Samantha's new hobby is challenging and it's #Silambam. An action heroine in the making.
— Galatta Media (@galattadotcom) April 20, 2017
Awesome @Samanthaprabhu2 pic.twitter.com/ywTaLeuXGB
ఆ సంగతి పక్కన పెడితే తెలుగులో నాగ్ రాజుగారి గది-2 తోపాటు విజయ్ సేతుపతి చిత్రం, విశాల్ తో మరో సినిమాలో సమంత మెయిన్ లీడ్ పోషిస్తోంది. అన్నట్లు దేశంలోనే బిగ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న సంఘమిత్ర కోసం శృతీహాసన్ కూడా కళరి(కత్తిసాము)తో కష్టపడటం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more