ట్యూబ్ లైట్ ఫస్ట్ లుక్ : భాయ్ ఎంత అమాయకంగా ఉన్నాడో...| Salman Khan's innocent look in Tubelight.

Salman khan look from tubelight out

Tubelight, Tubelight First Look, Tubelight First Look Poster, Tubelight Salman Khan Look, Salman Khan Look in TUbelight, Tubelight First Look, TUbelight Poster, Innocent Salman Khan Tubelight, Tubelight Movie,

Salman Khan's Mischievous Look Is Stealing Away Our Hearts in Tubelight First Look.

ఫస్ట్ లుక్ : సల్మాన్ ట్యూబ్ లైట్

Posted: 04/20/2017 10:46 AM IST
Salman khan look from tubelight out

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ట్యూబ్ లైట్ ఫస్ట్ లుక్ ను ఈ ఉదయం సల్మాన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నిన్న ప్రీ లుక్ పేరుతో వెనకాల నుంచి పోస్టర్ వదిలిన చిత్ర యూనిట్ ఇవాళ ముందు నుంచి సల్లూ భాయ్ లుక్కును వదిలింది.

పోస్టర్ లో కింద వార్ బ్యాగ్రౌండ్ ఉండగా, పైన బూట్లు మెళ్లో వేసుకుని, అమాయకం నిండిన చూపులతో సల్మాన్ సెల్యూట్ చేస్తున్నట్లు అందులో ఉంది. తన సోదరుడిని వెతుక్కుంటూ సరిహద్దులకు వెళ్లే ఓ వ్యక్తి పాత్రలో సల్మాన్ ఇందులో కనిపించబోతున్నాడు. ’ఏక్‌ థా టైగర్‌’, ’బజరంగీ భాయ్‌ జాన్‌’ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన కబీర్‌ ఖాన్‌ ఈ సినిమాకు దర్శకుడు కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

టీజర్ ను బాహుబలి -2 థియేటర్లలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా, దీపావళికి ట్యూబ్ లైట్ థియేటర్లలో సందడి చేయనుంది. భజరంగీ భాయ్‌ జాన్‌, సుల్తాన్‌ వంటి సూపర్‌ హిట్ సినిమాల తరువాత వస్తుండటంతో సల్మాన్ ఖాతాలో మరో హిట్ ఖాయమనే ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tubelight Movie  Salman Khan  First Look  

Other Articles