బాలయ్యకు హైకోర్టు నోటీసులు.. రుద్రమదేవికి కూడా | HC response on PIL against tax cut for GSP and Rudramadevi.

Hc notices to satakarni and rudramadevi makers

Gautamiputra Satakarni, High Court Notices, Tax Exemption, Gautamiputra Satakarni and Rudramadevi, Rudramadevi Tax Exemption, HC Notices Bala Krishna

PIL against tax cut for Balayya's movie 'Gautamiputra Satakarni' and Rudramadevi. HC serve notices those film makers including Bala Krishna.

శాతకర్ణి, రుద్రమదేవీ లకు హైకోర్టు నోటీసులు

Posted: 03/28/2017 02:45 PM IST
Hc notices to satakarni and rudramadevi makers

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పన్ను రద్దు వివాదంపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు స్పందించింది. ఈ మేరకు గౌతమీపుత్ర శాతకర్ణి టీంకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు గతంలో పన్ను రాయితీ పొందిన రుద్రమదేవి సినిమాల నిర్మాతలకు కూడా నోటీసులు ఇచ్చింది. రెండు సినిమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వగా, ఒక్క శాతకర్ణి సినిమాకు మాత్రమే ఏపీ ప్రభుత్వం
రాయితీ ఇచ్చింది.

అయితే వినోదపు పన్ను మినహాయింపు అనేది కేవలం ప్రేక్షకులకు మాత్రమే చెందేది అని పేర్కొంటూ, ఈ మేరకు సదరు చిత్ర నిర్మాతలకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తరపున వేణుగోపాల్ రావు అనే వ్యక్తి దీనిని వేశాడు. తన పిటిషన్ లో గతంలో తమిళనాడుకు సంబంధించిన ఓ తీర్పును పిటిషనర్ ఉటంకించాడు.

పిటిషన్ ను విచారించిన హైకోర్టు బాలయ్యతో పాటు శాతకర్ణి, రుద్రమదేవి చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, తమ నోటీసులకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని వాళ్లను ఆదేశించింది. ఒకానోక టైంలో గౌతమీపుత్ర శాతకర్ణి అంశం రాజకీయంగా కూడా విమర్శలకు తెర తీయగా, తన సినిమాకు కూడా టాక్స్ మినహాయింపు ఇవ్వాలని గుణశేఖర్ ఏపీ ప్రభుత్వానికి ఓ బహిరంగ లేఖ కూడా రాశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Rudramadevi  High Court Notices  Tax Exemption  

Other Articles