బ్రెస్ట్ పట్టుకుని బెడ్ రూంకి రమ్మన్నాడు..కోహ్లీపై హీరోయిన్ కంప్లైంట్ | Serial Actress Sexual Harassment case against Kohli.

Shilpa shinde files sexual harrashment against producer

TV actress Shilpa Shinde, Shilpa Shinde Sexual Harassment, TC Actress Sexual Harassment, Bhabhiji Ghar Par Hai Actress, Bhabhiji Ghar Par Hai Sexual Harassment, Sanjay Kohli Sexual Harassment, Sanjay Kohli Shilpa Shinde, TV Actress Sexual Harassment

TV actress Shilpa Shinde files sexual harassment case against 'Bhabhiji Ghar Par Hai' producer Sanjay Kohli.

నిర్మాత లైంగిక వేధింపులపై సీరియల్ నటి

Posted: 03/25/2017 11:09 AM IST
Shilpa shinde files sexual harrashment against producer

మరో నటి లైంగిక వేధింపుల ఉదంతం వెలుగు చూసింది. హిందీ బుల్లితెరలో పాపులర్ అయిన హీరోయిన్ శిల్పా షిండే తనపై జరిగిన లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్మాత సంజయ్ కోహ్లీ తనపై బెదరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తోంది. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మరో వివాదం కూడా నెలకొంది.

ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే 'బాబీజీ ఘర్‌ పర్‌ హై' తో 39 ఏళ్ల శిల్పా షిండే స్టార్ అయ్యింది. ఆ షో నిర్మాత సంజయ్‌ కోహ్లి కాంట్రాక్టులో ఎక్స్‌క్లూజివ్‌ అనే క్లాజ్‌ పెట్టాడని, ఆపై మానసికంగా టార్చర్ పెడుతున్నాడంటూ గతేడాదే ఓ ఫిర్యాదు చేసింది. కౌంటర్ గా ఆమె షో నుంచి తప్పుకోవటంతో నష్టం వచ్చిందని రూ. 12.5 కోట్ల దావాను నిర్మాతపై కోహ్లి వేశాడు.

అయితే ఇప్పుడు మరో కొత్త ఫిర్యాదు చేస్తూ అందులో తనను లైంగికంగా వేధించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఈ మేరకు వాల్వీ నైగావ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ హాట్‌, సెక్సీ అంటూ సెట్స్ లో పిలిచేవాడని, తరచూ అసభ్యంగా తాకాలని యత్నించేవాడని అందులో పేర్కొంది. ఓసారి వక్షోజాలపై చెయ్యి వేశాడని, గట్టిగా అరవటంతో, విషయం గురించి బయట చెప్తే షో నుంచి తీసేస్తానని బెదిరించాడని తెలిపింది. ఓసారి మేకప్‌ రూమ్‌లో ఉండగా వచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకుంటేనే షోలో కొనసాగుతావని చెప్పటం, అది విన్న మేకప్ మ్యాన్ ను తీసేయటం జరిగాయని వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhabhiji Ghar Par Hai  Shilpa Shinde  Sexual Harassment Case  

Other Articles