టాప్ హీరో రేసు పై ఇంట్రెస్టింగ్ కామెంట్.. వారసుల కంటే నేనే బెటర్ | I am better than Rana, Chaitanya.

Venkatesh guru movie interview

Venakatesh Guru Movie Interview, Venky Guru Interview, Guru Movie Promotions, Venkatesh Nephews, Venky Better than Chai Rana

Victory Venakatesh Guru Movie Interview. Says He is much better than young stars who is now existing in Tollywood. Better Dancer than Rana and Naga Chaitanya.

టాలీవుడ్ టాప్ రేసులో ఎప్పుడూ లేను-వెంకీ

Posted: 03/25/2017 10:27 AM IST
Venkatesh guru movie interview

ఓవైపు వారసులు వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నా సరే నాగ్, వెంకీలు మాత్రం ఇంకా అగ్ర హీరోలుగా తమ ఎఫెక్ట్ చూపుతూనే ఉన్నారు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సక్సెస్ రేటు విషయంలో మాత్రం తానెప్పుడూ వెనకబడే ఉన్నానని, అసలు తాను టాప్ రేసులో లేనని ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాడు దగ్గుబాటి సీనియర్ హీరో.

ఫ్యామిలీ హీరోగా ట్యాగ్ లైన్ వేసుకున్న వెంకీ ప్రయోగాలకు కూడా సిద్ధమేనని ప్రకటించాడు. అందుకే బాక్సింగ్ కోచ్ అవతారంలోకి మారిపోయి గురు గా రాబోతున్నాడు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వెంకీ పలు ఆసక్తికర విషయాలు చెబుతున్నాడు. అబ్బాయి, మేనల్లులకు మీరు పోటీ అని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేను వారి కంటే ఎందులోనూ తక్కువ కాదు. వాళ్ల కంటే చాలా బెటర్ గా, ఆ మాటకొస్తే ఇప్పుడున్న యంగ్ స్టర్ లో చాలా మంది కంటే ఎనర్జిటిక్ గా నటించగలను, స్టెప్పులు కూడా వేయగలను అంటూ చెప్పుకొచ్చాడు.

ఫ్యామిలీ హీరోగా తనకు ఎంత క్రేజ్ ఉందో, మాస్ రోల్ లో కూడా అంతకంటే మంచి అవుట్ పుట్ ఇవ్వగలనని అంటున్నాడు. గతంలో ప్రయోగాలు అంతగా సక్సెస్ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. అందుకే ఆదరిస్తారన్న నమ్మకం ఉంది, అయినా తన దృష్టిలో ఫ్లాప్ అంటే ప్రేక్షకులకు కంటెంట్ కనెక్ట్ కాకపోవటమే తప్ప, పాత్ర వేస్టేజ్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన గురు మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Guru Movie Interview  Tollywood  

Other Articles