కేథరిన్ పై మళ్లీ అలాంటి రూమరా? | catherine tresa again as MLA?

Catherine tresa on teja movie rumour

Catherine Tresa, Catherine Tresa Teja Movie, Catherine Tresa Upcoming Movies, Catherine Tresa Rumour, Catherine Tresa Tribal Girl, Catherine Tresa deny Rumour, Catherine Tresa Rana, Catherine Tresa Aarya Movie

Catherine Tresa clears the air on tejas film stating she is not playing a politician.

తేజ సినిమా రూమర్ పై కేథరిన్ క్లారిటీ

Posted: 03/24/2017 03:55 PM IST
Catherine tresa on teja movie rumour

ఖైదీ లో చిరు సరసన ఐటెం సాంగ్ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు కేథరిన్ ను అయ్యో పాపం అనుకున్నారు. అయితే తాను చేసే ప్రతీ పనిలో తనకు ఓ క్లారిటీ ఉందని అంటోంది ఈ మల్లూ బ్యూటీ. మంచి ఛాన్సులు మిస్సవుతున్నప్పటికీ తన చేతిలో ఉన్నవి క్రేజీ ప్రాజెక్టులే నని అంటోంది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న నేనే రాజు.. నేనే మంత్రిలో కాజల్ తోపాటు కేథరిన్ కూడా ఓ హీరోయినే. అయితే రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాగా, పైగా ఇంతకు ముందు సరైనోడులో ఎమ్మెల్యే పాత్రలో జీవించేయటంతో ఇప్పుడు అలాంటి రోలే చేస్తుందని అంతా అనుకున్నారు.

కానీ, సినిమాలో తనది పొలిటీషియన్ రోల్ కాదని క్లారిటీ ఇచ్చేసింది. సినిమాలో నేను రాజకీయ నేతను కాను. సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ ను ఎలివేట్ చేయటం సరికాదని చెబుతోంది. మరోపక్క సహచర నటుడిని పొగడ్తలతో ముంచెత్తింది కూడా. రానా సినిమాల ఛాయిస్ బావుంటుదన్న కేథరిన్, ఘాజీ లాంటి సినిమాలు చేయాలంటే గట్స్ చాలా అవసరమంటూ చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళ సినిమాల్లో తన ఎంపిక ఏంటో తనకు తెలుసన్న ఈ బ్యూటీ ఒకే టైప్ ఆఫ్ మూవీలు చేయాలంటే తనకూ బోర్ కొడుతుందని అంటోంది.

ప్రస్తుతం రానా సినిమాతోపాటు గోపీ చంద్ హీరోగా సంపత్ నంది తీస్తున్న గౌతమ్ నందలో కేథరిన్ ఓ హీరోయినే. మరోపక్క భారీ రెమ్యునరేషన్ తో బెల్లంకొండ శ్రీను హీరోగా బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది. ఇక కోలీవుడ్ లో ఆర్య కథానాయగన్ లో కేథిరినే హీరోయిన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  Teja Movie  Rumour  

Other Articles