టాలీవుడ్ టాప్ నిర్మాత కొడుకు పర్స్‌ కొట్టేసి బుక్కయ్యాడు | Tollywood Producer's Son Booked for Robbery.

Robbery case on popular producer son

Tollywood Producer Son, C Kalyan's Son, C Kalyan's son, C Kalyan Varun, Tollywood Producer Son Robbery, Producer C Kalyan, Producer C Kalyan Son, Producer Son Theft Case

Tollywood Producer C Kalyan's son named in theft at film club. varun Kumar steal a businessman purse and after transfer money into his account.

నిర్మాత కళ్యాణ్ తనయుడిపై దొంగతనం కేసు

Posted: 03/24/2017 01:11 PM IST
Robbery case on popular producer son

టాలీవుడ్ సీనియర్ నిర్మాత సీ కళ్యాణ్ తనయుడు వరుణ్ కుమార్ చోరీ కేసులో బుక్కయ్యాడు. హైదరాబాద్ కి చెందిన ఓ బడా వ్యాపారవేత్త పర్స్ ను దొంగిలించి, అందులోని కార్డులను యథేచ్ఛగా వాడాడన్న ఆరోపణలతో అతనిపై కేసు నమోదయ్యింది.

ఫిల్మ్ నగర్ క్లబ్ లో తన తనయుడితో సదరు వ్యాపారవేత్త స్విమ్మింగ్ కు వచ్చాడు. ఆ సమయంలో తన దుస్తులతోపాటు పర్స్ ను ఓ టేబుల్ పై ఉంచి వెళ్లాడు. ఇదే అదనుగా భావించి ఎవరో ఆ పర్స్ ను కొట్టేశారు. గంట తర్వాత ఒక కార్డు నుంచ లక్షా ఎనభై వేలు, మరో కార్డు నుంచి 27 వేలు ఒక అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విచారణలో సీసీ పుటేజీలో వరుణే దొంగతనం చేసినట్లు క్లియర్ గా స్పష్టం అయ్యింది. అంతేకాదు డబ్బు ట్రాన్స్ ఫర్ అయిన అకౌంట్ కూడా అతనిదే అని తేలటంతో కేసు నమోదయ్యింది. నిర్మాతగానే కాదు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా సీ కళ్యాణ్ సుపరిచితుడే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Producer  C Kalyan Son  Theft Case  

Other Articles