ప్రభాస్ కొత్త మూవీ టీజర్ ఈ వారంలోనే... బాహుబలి-2 తో లింకు ఉందా? | Prabhas new movie teaser shoot this week.

Prabhas new movie teaser with baahubali 2

Prabhas New Movie Teaser, Prabhas Sujith Movie Teaser, Prabhas Sujith Movie, Prabhas New Teaser, Prabhas Latest Movie Teaser, Prabhas New Look, Prabhas New Movie First Look

Prabhas ready to shoot for Sujith Movie teaser. Prabhas 19th movie first look released along with Baahubali 2.

ప్రభాస్ కొత్త సినిమా టీజర్ బాహుబలితోనే...

Posted: 03/20/2017 03:37 PM IST
Prabhas new movie teaser with baahubali 2

బాహుబలితోనే 5 ఏళ్ల కాలయాపన చేసిన ప్రభాస్ ఎట్టకేలకు కొత్త చిత్రం కోసం రెడీ అయిపోయాడు. బయటి వాళ్లతో ప్రాజెక్టులు ఒప్పుకోకుండా మొత్తం సొంత వాళ్ల బ్యానర్ లోనే కమిట్ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇక తన కోసమే కాచుకుని ఉన్న సుజిత్ తో అల్రెడీ సినిమా ముహుర్తం షాట్ కానిచ్చేసిన ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనటానికి మాత్రం ఇంకాస్త సమయం పడుతుందంట.

అయితే ఈలోపు బాహుబలి-2 క్రేజ్ ను తన సినిమా కోసం వాడుకునేందుకు రెడీ అయిపోయాడు యంగ్ దర్శకుడు. ఇప్పటికే కాస్త బరువు తగ్గిన ప్రభాస్ ట్రైలర్ లాంఛింగ్ లో కొత్త లుక్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కొత్త సినిమా కోసం మరింత వెయిట్ తగ్గాల్సి ఉన్నప్పటికీ ఆలోపే ఓ టీజర్ లాంటి షాట్ ను రిలీజ్ చేయాలన్న ఫ్లాన్ లో ఉన్నారు.

ఈ వారమే కొత్త సినిమా టీజర్ ను షూట్ చేసి బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ సమయానికి సిద్ధం చేసి రిలీజ్ చేయలన్నది మేకర్ల ఫ్లాన్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో టెక్నీషియన్స్ తోపాటు పాత్రలకు కూడా నాలుగైదు బాలీవుడ్ మొహాలు కనిపించనున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Director Sujith  19th Movie  Teaser  

Other Articles