ట్రైలర్ పై కామెడీ.. ఆ ఒక్క సీన్ కోసం పడ్డ కష్టం మీకు తెలుసా? | Rajamouli about Katappa Killing Scene.

Baahubali 2 behind iconic scene

Baahubali 2 Trailer, Baahubali 2 Trailer Records, WKKB, Baahubali 2 Trailer Comedy, Satires on Baahubali 2 Trailer, #wkkb, Baahubali Iconic Scene, Katappa Killing Scene

Rajamouli explained how they face problems to shoot Baahubali iconic scene.

కట్టప్ప కిల్లింగ్ బాహుబలి... పెద్ద కష్టమే!

Posted: 03/17/2017 12:52 PM IST
Baahubali 2 behind iconic scene

బాహుబలి పార్ట్ 2 యూట్యూబ్ రికార్డులన్నింటినీ తుడిచి పడేసింది. సమీప భవిష్యత్తులో మరెయితర సినిమా కూడా అందుకోలేనంతగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది బాహుబలి. 24 గంటల్లో 2 కోట్ల పై వ్యూవ్స్ తో దూసుకుపోతుంది. మొత్తం మీద అన్ని భాషల్లో కలుపుకుని మొత్తం 50 మిలియన్ల వ్యూవ్స్ తో ప్రకంపనలు రేపింది.

అయితే ఇందులో కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ వీక్ గా ఉండటం, పైగా అనుష్కను పోరాట యోధురాలిగా చూపిస్తేనే... రొమాంటిక్ సాంగ్ లో కామెడీ స్టెప్పులు వేయించటంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. అయితే హైప్ తగ్గించటంలో భాగంగానే ఈ స్ట్రాటజీ మెయింటెన్ చేస్తున్నారేమోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోపక్క నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన ఈవెంట్ లో కరణ్ జోహర్ కి కట్టప్ప కత్తిని బహుకరించాడు. ఆపై ప్రెస్ మీట్ లో బోలెడన్నీ విషయాలు చెప్పుకొచ్చాడు. కట్టప్ప బాహుబలిని చంపే సీన్ కోసం సెట్ విషయంలో పడ్డ కష్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. పార్ట్ వన్ సీన్ చంబల్ లోయలో తీయగా, మళ్లీ షూటింగ్ కోసం వెళ్లే సరికి అక్కడంతా చెట్లతో నిండిపోయి ఉందంట. దీంతో సాబు సిరిల్ ఇక్కడే ఓ స్పెషల్ సెట్ వేయించాడంట. 60 అడుగుల ఎత్తులో రాళ్లున్న ఓ క్వారీలో 200 మంది సుమారు 45 రోజులు కష్టపడి 100 ట్రక్కు లోడ్ ల బురద, ప్రత్యేక రోడ్లు వేసి సెట్ నిర్మించాక సీన్ ను తీసినట్లు చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ సీన్ మాత్రం ఖచ్ఛితంగా నిలిచిపోతుందని ధీమాగా చెబుతున్నాడు జక్కన్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2 Trailer  Mumbai Launch  Rajamouli  

Other Articles