కోర్టులో ధనుష్.. పుట్టుమచ్చలతో పేరెంట్స్ ఎవరో తేలుతుందా? | Dhanush appears in court to verify birthmarks.

Hero dhanush attends to madurai court

Dhanush Paternity Case, Dhanush Madurai Court, Dhanush Birthmarks, Hero Dhnush Court, Madurai Court Summon Dhanush, Dhanush Case, Hero Dhanush, Rajinikanth Son In Law Parents

Paternity Claim Hero Dhanush Appears In Court To Verify Birthmarks.

మధురై కోర్టుకు హాజరైన హీరో ధనుష్

Posted: 02/28/2017 12:52 PM IST
Hero dhanush attends to madurai court

కోలీవుడ్ యువ నటుడు దనుష్ ఓ తీవ్ర వివాదంలో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. తిరువనంతపురంకు చెందిన ఓ జంట ఈ రజనీకాంత్ మాపిల్లై(అల్లుడు) తమ బిడ్డేనంటూ కేసు దాఖలు చేశారు. అంతేకాదు నెలకు తమకు 65 వేల భరణం ఇప్పించాలంటూ అందులో డిమాండ్ కూడా చేశారు. దీంతో ఈ ఫేక్ పెరెంట్స్ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో నేడు కోర్టులో టెస్టులకు ధనుష్ హాజరయ్యాడు. ధనుష్ అసలు పేరు కలైయారసన్ అని, కతిరేసన్ మరియు మీనాక్షి దంపతుల వాదన.12 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇతగాడు 2002 లో ధనుష్ గా పేరు మార్చుకుని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడని వారు చెబుతున్నారు. దీంతో ఈ స్టార్ నటుడికి నోటీసులు పంపిన మద్రాస్ హైకోర్టు లోని మధురై బెంచ్ ఈరోజు
హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

అంతకు ముందు స్కూల్ టీసీలో ధనుష్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని పేర్కొనగా, అసలు తండ్రి అని చెబుతున్న దర్శకుడు కస్తూరి రాజా నాయకర్ కులస్థుడు కావటంతో కొత్త అనుమానాలు రేకెత్తాయి. ఆ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొనలేక పోవడంతో, పుట్టుమచ్చలు వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని శనివారమే కోర్టు సూచించింది.  ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం హైటెన్షన్ నడుమే ఈ నటుడు కోర్టుకు హాజరు అయ్యాడు. అక్కడి జ్యుడీషియల్ ఛాంబర్ లోనే ప్రభుత్వ వైద్యుడి ఆధ్వర్యంలో ధనుష్ కి పుట్టుమచ్చల గుర్తింపు టెస్ట్ నిర్వహించగా, అనంతరం మార్చి 2కి కేసు వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Dhanush  Paternity Case  Madurai Court  Birthmarks Identification  

Other Articles