రానా మళ్లీనా? తేడా రిజల్ట్ కొడితే ఎలా... | Rana experiments with historical movies.

Rana next also fictional historical

Rana Daggubati, Rana Historical Movie, Rana British India Movie, Rana Next Movie, Rana Upcoming Movie, Rana Another War Based Movie, Rana KCR CBN, Rana Rare Photo, Rana Teja Movie, Rana Solider

Rana Daggubati's next is also going to be a period film that would be set in the backdrop of 1945 s.

రానా మళ్లీ హిస్టారికల్ సినిమానేనా?

Posted: 02/24/2017 03:22 PM IST
Rana next also fictional historical

బాహుబలికి ముందు కృష్ణం వందే జగద్గురమ్ లో సోలో హీరోగా చేసిన రానా తిరిగి దాదాపు ఐదేళ్ల తర్వాత ఘాజీతో మళ్లీ ముందుకు వచ్చాడు. యూనిక్ కథ, కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్, అన్నింటికి మించి ఓ యుద్ధానికి సంబంధించిన హిస్టారికల్ పాయింట్ కావటంతో సినిమాపై అంచనాలు అదే రేంజ్ లో పెరిగిపోయాయి. అదే స్పీడ్ తో సాలిడ్ హిట్ కూడా అందుకున్నాడు.

ప్రస్తుతం మూడు భాషల్లో ఘాజీకి మాంచి కలెక్షన్లే వస్తున్నాయి. నెక్స్ట్ బాహుబలి-2 రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి ఆ తర్వాత ఏ సినిమాలో నటించబోతున్నాడు. ఈ ప్రశ్నకు తానే స్వయంగా సమాధానమిస్తున్నాడు. తర్వాత చేయబోయేది కూడా వార్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీ అని చెబుతున్నాడు. 1945 నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడంట. ఘాజీ లాగానే ఇది కూడా పూర్తి కల్పితంగానే ఉండబోతుందంట. 

సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న సినిమా గురించి మిగతా వివరాలు మాత్రం తెలియజేయలేదు. బాహుబలి, రుద్రమదేవి, ఘాజీ, బాహుబలి-2 ఇలా... రాను రాను పిరియాడికల్ సినిమాల స్పెషలిస్ట్ హీరోగా ఈ దగ్గుబాటి వారసుడు మారిపోతున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

ఇదిలా ఉంటే ఓ రేర్ పోటో నెట్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తెలుగు ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లతో తన తాన రామానాయుడు ఉన్న ఓ ఫోటోను రానా షేర్ చేశాడు. రామానాయుడు ట్రస్ట్ ఓపెనింగ్ సందర్భంగా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రిబ్బన్ కట్ చేస్తుండగా, అది అందించే కుర్రాడిగా రానాను మనం చూడొచ్చు. ఇక అప్పుడు కాబినెట్ లో మినిస్టర్ గా కేసీఆర్ ఉన్నాడు. అన్నట్లు ఆ ఫోటోలో బాబాయ్ వెంకీ కూడా ఉన్నాడులేండి. ఇక ఇప్పుడు తేజ దర్శకత్వంలో ఓ పొలిటికల్ ఎంటర్ టైనర్ లో కూడా నటించబోతున్నాడు రానా.

Rana with Telugu CMs

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Historical Movie  British India War  

Other Articles