ఓవర్సీస్ కుమ్ముడులో గెలుపు ఎవరిదంటే... | Chiru or Balayya who won Overseas battle.

Khaidi no 150 and gsp overseas collections

Khaidi No 150 GSP Over Seas Collections, Khaidi No 150 Overseas Profit, GSP Overseas Collections, Khaidi No 150, Gautamiputra Satakarni Overseas Collections, Chiru or Balayya Overseas King, 150 100 Overseas Collections

Gautamiputra Satakarni Overseas Collections Dominate Chiranjeevi's khaidi No 150. While Khaidi distributor had earned around 1 crore profit, Satakarni Distributor made a staggering 2 crores 40 lakhs profit.

ఖైదీ, శాతకర్ణి ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు...

Posted: 02/22/2017 11:29 AM IST
Khaidi no 150 and gsp overseas collections

పదేళ్ల తర్వాత మెగాస్టార్ రీఎంట్రీతో పైగా 150వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తే, చారిత్రాత్మక సబ్జెక్ట్ ను ఎంచుకుని బాలయ్య వందో చిత్రంతో ఆశ్చర్యపరిచాడు. ఒకేసారి బరిలో దిగినప్పటికీ ఇద్దరూ తమ మైల్ స్టోన్ చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు. అయితే అనుకున్నదాని కంటే చిరు మెరుగైన ఫలితాలను రాబట్టగా, బాలయ్య కూడా దాదాపు బిజినెస్ చేసిన దానికంటే ఎక్కువే వసూలు చేసి యంగ్ హీరోలకు టఫ్ సవాళ్లు విసిరారు.

తెలుగు రాష్ట్రాల్లో సంగతి ఏమోగానీ ఓవర్ సీస్ లో మాత్రం వాళ్ల డామినేషన్ గురించి ప్రత్యేక చర్చ జరిగింది. తొలిరోజు పెద్ద సంఖ్యలో థియేటర్లు ఖైదీ వశం కావటం, పైగా యూఎస్ లో చిరు క్రేజీ కారణంగా మిలియన్ మార్క్ కేవలం ప్రీమిర్లతోనే సాధించేసి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక తక్కువ స్క్రీన్లలో వచ్చినా అదే ఊపులో బాలయ్య కూడా అక్కడ మంచి ఫలితాన్నే రాబట్టగలిగాడు. ఇక కలెక్షన్లు ఓ కంక్లూజన్ కి వచ్చేసరికి ఓవర్సీస్ లో ఎవరెంత దమ్ము చూపారన్నదానిపై ఓ లెక్క తేలింది.

మొత్తానికి ఆల్ టైం తెలుగు సినిమాలతో మిలియన్ డాలర్ బేబీ లిస్ట్ లో ఖైదీ నంబర్ 150 నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం అమెరికాలోని 186 లోకేషన్లలో 9.45 కోట్ల షేర్ రాబట్టగా, మిగతా దేశాల్లో సుమారు 2.50 కోట్లు రాబట్టి టోటల్ గా 11.95 కోట్లతో ఖైదీ నంబర్ 150 కలెక్షన్లను క్లోజ్ చేసింది. ఆ లెక్కన డిస్ట్రిబ్యూటర్ 10 కోట్లకు హక్కులను కొనుగోలు చేయగా దాదాపు కోటి లాభం వచ్చిందన్న మాట. అయితే ఈ విషయంలో నిర్మాత 12 కోట్లకు ఓవర్సీస్ హక్కులను అమ్మినట్లు మరో వాదన కూడా ఉంది.

ఇక శాతకర్ణి విషయానికొస్తే... తెలుగు మూవీ లిస్ట్ లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. కలెక్షన్ల కుమ్ముడును గనుక చూస్తే 135 లోకేషన్లలో 6.25 కోట్లు రాబట్టిన శాతకర్ణి, మిగతా దేశాల్లో ఒక కోటి 25 లక్షలు కలెక్ట్ చేసింది. అంటే టోటల్ గా ఏడున్నర కోట్లు వసూలు చేసిందన్న మాట. 4.1 కోట్లకు శాతకర్ణి హక్కులు అమ్ముడుపోగా, 2 కోట్ల 40 లక్షల ప్రాఫిట్ తో బాలయ్య ఓవర్సీస్ రేసులో సిసలైన గెలుపు సాధించాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Balakrishna  Overseas Collections  

Other Articles