అఖిల్ పెళ్లి కాన్సిల్... ఎవరి పని? | Nagarjuna's son Akhil Akkineni Wedding Call Off.

Akhil marriage call off nagarjuna in depression

Nagarjuna son Akhil, Akhil Akkineni Break Up, Shriya Bhupal Akhil Akkineni Wedding, Akkineni Wedding Call Off, Nagarjuna Depression, Nagarjuna Upset, Akhil Marriage cancel, Akkineni Akhil Life, Akhil Shriya Break Up

Nagarjuna’s son Akhil Akkineni, Shriya Bhupal call off May wedding, end relationship. But, There is no official confirmation yet.

అఖిల్ ఎంగేజ్ మెంట్ రద్దు.. నిజమేనా?

Posted: 02/22/2017 10:43 AM IST
Akhil marriage call off nagarjuna in depression

ఓం నమో వేంకటేశాయ సినిమా ఫలితం తేడా కొట్టడంతో అక్కినేని నాగార్జున గత కొంత కాలంగా ఎవరికీ ముఖం చూపించకుండా కేవలం ఇంటికే పరిమితం అయ్యాడన్న వార్త ఒకటి చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే వాటిని పటాఫంచల్ చేస్తూ రాజుగారి గది-2 షూటింగ్ లో పాల్గొనటమే కాదు, ఏకంగా హీరోయిన్ సీరత్ కపూర్ తో కలిసి ఓ సెల్ఫీ కూడా దిగాడు నాగ్. కానీ, డిప్రెషన్ మాట ఏమోగానీ, తనయుడి వ్యవహారంతో నాగ్ కాస్త అప్ సెట్ గా ఉన్నట్లు మాత్రం అర్థమౌతోంది.

చిన్న తనయుడు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న ఓ పుకారు నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది. వాస్త‌వానికి అఖిల్ క‌న్నా శ్రేయ వ‌య‌సులో కొంత పెద్ద‌ది. అయినా ప్రేమించుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ఇరు కుటుంబాల పెద్ద‌లు వీరి పెళ్లికి ఓకే చెప్పారు. ఆ మధ్యే గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. (ఫోటోల కోసం క్లిక్ చేయండిఅయితే వీరిద్ద‌రి పెళ్లి క్యాన్సిల్ కావ‌డం వెన‌క ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. అఖిల్ ఇంకా కేరీర్‌లో నిల‌దొక్కుకోలేదు. పాత‌కేళ్లు కూడా రాకుండానే పెళ్లేంటి..? అని ఇప్పుడు ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. మ‌రో టాక్ ఏంటంటే అఖిల్ – శ్రియ మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలే ఇందుకు కార‌ణం అంటున్నారు. ఇద్దరి మధ్య కాంప్రమైజ్ చేసేందుకు యత్నించినప్పటికీ అది వీలు పడలేదని టాక్.

వీరి పెళ్లి మేలో రోమ్‌లో జ‌ర‌గాల్సి ఉంది. పెళ్లి వార్త కాన్సిల్ ను ధృవీకరిస్తూ బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్లను కాన్సిల్ చేసుకోవాల్సిందిగా ఇరు కుటుంబాలు బంధువులకు సూచించినట్లు తెలుస్తోంది. ఓవైపు కెరీర్ పరంగానే కాదు, మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా కొడుకు వ్యవహారంతో నాగ్ కాస్త బాధలో ఉన్నట్లు సమాచారం. జాతీయ మీడియాలో కూడా దీనిపై కథనాలు వస్తుండటంతో నాగ్ ఎలా రియాక్ట్ అవుతాడన్నదానిపైనే ఇప్పుడు అందరి వెయిటింగ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Akhil  Shriya Bhupal  Marriage  Call Off  

Other Articles