సంభవామి కాదంట... టైటిల్ ఏంటో ఆ స్టార్ ప్రోడ్యూసర్ లీక్ చేశాడు PVP on Mahesh movie title.

Star producer on mahesh murugadoss movie title

Sambavami Yuge Yuge, Mahesh Babu Murugadoss Movie, Mahesh Babu New Movie Title, Mahesh Babu New Movie, PVP Mahesh Murugadoss Movie Title, Sambavami Yuge Yuge Title, Tagore Madhu Sambavami Yuge Yuge, Mahesh Babu 2017 Movie

Mahesh Babu Murugadoss Bilingual movie titlted as Sambavami Yuge Yuge. Star Producer PVP hind on that at Winner Pre Release event.

మహేష్ మూవీ టైటిల్ అదేనంట!

Posted: 02/20/2017 03:46 PM IST
Star producer on mahesh murugadoss movie title

మహేష్ మురగదాస్ సినిమా ఆల్ మోస్ట్ చివరి దశకు చేరుకున్నప్పటికీ టైటిల్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఫస్ట్ లుక్ విడుదల కానీ ఈ చిత్రం టైటిల్ విషయంలోనే సుమారు 6 నెలల కాలాయపన చేసేసింది. ఇంతకు ముందు హిందీ వర్షన్ టైటిల్ విషయంలో ఓ స్పష్టత వచ్చినట్లు లీక్ ల ద్వారా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ పై ఓ క్లారిటీ వచ్చేసినట్లే అనిపిస్తోంది.

తొలినాళ్లలో ఏజెంట్ శివ, మిస్టర్ శివ, వాస్కోడిగామా ఇలా రకరకాల టైటిళ్లు వినవచ్చిన ఈ చిత్రం చివరకు సంభవామి అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే అది కేవలం హిందీ వర్షన్ కావటంతో తెలుగు, తమిళ్ టైటిళ్ల విషయంలోనే ఏంటన్నది ఓ స్పష్టత లేకుండా పోయింది. కానీ, స్టార్ ప్రొడ్యూసర్ పీవీపీ మహేష్ మూవీపై ఎట్టకేలకు హింట్ ఇచ్చేశాడు.    వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ చిత్ర నిర్మాతల్లో ఠాగూర్ మధు కూడా ఓ భాగస్వామిగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. విన్నర్ ప్రీ రిలీజ్ ఆడియో పంక్షన్ లో మాట్లాడుతూ మధు ఈ యేడాది మూడు సినిమాలు నిర్మించబోతున్నాడని, అందులో ఒకటి విన్నర్ కాగా, రెండోది మిస్టర్ అని, ఇక చివరిది సంభవామి యుగే యుగే అని ప్రకటించాడు. ఈ మధ్యే సంభవామి అనే టైటిల్ గురించి లీక్ అందగా, బహుశా తెలుగు, తమిళ్ వర్షన్ ల కోసం సంభవామీ యుగే యుగే గా రిజిస్టర్ చేయించి ఉంటారని అర్థమౌతోంది.

మొత్తానికి తమ ఫేవరెట్ హీరో చిత్ర టైటిల్ విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత రావటంతో అభిమానులు పండగ చేస్కుంటున్నారు. కానీ, అది అధికారికంగా వెలువడేది మాత్రం ఫస్ట్ లుక్ తోనే సుమీ! ప్రస్తుతానికైతే టీజర్ ను సుమారు 30 లక్షల తో రూపొందించబోతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sambavami Yuge Yuge Movie  Mahesh Babu  AR Murugadoss  Movie Title  

Other Articles