పాపం తాప్సీ.. ఆ రెండు వేస్ట్ అయ్యాయి.. Taapsee upset with two movies got rave talk.

Tapsee need a big hit in bollywood

Taapsee, Taapsee The Ghazi Attack, Taapsee Role Waste, Taapsee Running Shaadi, Running Shaadi Reviews, Taapsee Bollywood Movies, Taapsee Movies, Taapsee Bollywood 2017, Taapsee Upset

Pink success not continue for Taapsee. While Running Shaadi received poor reviews, The Ghazi Attack got rave reviews but her role didn't get appreciation. She couldn't get noticed with her brief role in the Ghazi.

తాప్సీకి ఆ రెండు చిత్రాలు అచ్చిరాలేదు

Posted: 02/17/2017 04:34 PM IST
Tapsee need a big hit in bollywood

బాలీవుడ్ లో సౌత్ భామ తాప్సీ ఇప్పుడు జోరు చూపిస్తోంది. ముఖ్యంగా పింక్ సక్సెస్ తర్వాత కెరీర్ ఊపందుకుంది. ఓవైపు ఇవాళ ఒక్కరోజే ఆమె నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కాగా, మరో రెండు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే మంచి కథ ఉన్న సినిమాలు ఎంచుకోవటంలోనే అసలు మజా ఉంటుందని చెబుతున్న ఈ భామ ఇక నుంచి గ్లామర్ రోల్స్ కి కాస్త దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందంట.

ఇదిలా ఉంటే తాప్సీకి డబుల్ షాకే తగిలినట్లు సమాచారం అందుతోంది. ఇవాళ రిలీజ్ అయిన రన్నింగ్ షాదీ, ది ఘాజీ అటాక్ లు రెండూ కూడా ఆమెకు హెల్ప్ కాలేకపోయాయని చెబుతున్నారు. కామెడీ రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన రన్నింగ్ షాదీకి పూర్ రేటింగ్స్ రాగా, ఘాజీకి హిట్ టాక్ వచ్చినప్పటికీ, అందులో ఆమె రోల్ అంత ప్రాధాన్యత లేనిదని చెబుతున్నారు.

ఈ లెక్కన రెండు సినిమాలతో కూడా తాప్సీకి ఒరిగింది ఏం లేదని, పింక్ సక్సెస్ వేస్ట్ అయిపోయిందన్న టాక్. ఇక మిగిలింది నామ్ షబ్నా, జుడ్వా లు. ఇందులో మొదటి సినిమా బేబీకి ప్రీక్వెల్ గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో ఫెర్ ఫార్మెన్స్ కాస్త కనిపిస్తుండటంతో హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి తాప్సీకి బాలీవుడ్ బిగ్ బ్రేక్ ఎలా దక్కుతుందో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taapsee  Bollywood Movies  2017  

Other Articles