సక్సెస్ ఫుల్ హీరో అన్న ట్యాగ్ లైన్ కోసం స్టార్ కిడ్స్ పరితపిస్తున్న ఈరోజుల్లో వరుసగా ఆరు హిట్లు(మజ్ను యావరేజ్ ) కొట్టి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు నేచురల్ స్టార్ నాని. నేను లోకల్ కి వచ్చిన ఓపెనింగ్స్ నాని స్టామినా ఏంటో చూపిస్తున్నాయి. నాని నిజంగా ఇప్పుడు ఓ స్టార్ హీరో అని ఒప్పుకుని తీరాల్సిందే ఇప్పుడు. యావరేజ్ కంటెంట్ ను ఈ స్థాయి సక్సెస్ అయిందంటే అందులో నాని క్రెడిట్ సగం కంటే ఎక్కువే ఉందని చెప్పుకోవాలి.
‘నేను లోకల్’ ఆల్రెడీ ఫస్ట్ వీకెండ్లోనే రూ.15 కోట్ల షేర్ రాబట్టిన నేను లోకల్ ఐదు రోజుల విషయానికొచ్చేసరికి 20 కోట్ల కలెక్షన్లతో దుమ్ముదులిపి పడేసింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ, జస్ట్ రెండు రోజుల కలెక్షన్లతోనే డిస్ట్రిబ్యూటర్ లు సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లడమంటే మాములు విషయం కాదు. కానీ, నాని ఆ ఫీట్ చేసి చూపించాడు. టైటిల్ కు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లోనే నాని రాబట్టిన కలెక్షన్లు 15 కోట్లు. మరోవైపు భలే భలే మగాడివోయ్ తర్వాత సెకండ్ మిలియన్ మార్క్ అందుకునేందుకు చిత్రంగా నేను లోకల్ ఇంచు దూరంలో ఉంది.
మొత్తానికి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా డిస్ట్రిబ్యూటర్లకు ఏ మాత్రం డ్యామేజ్ చేయని హీరోగా, తనకంటూ ఓ మినిమయ్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు నాని. మినిమం 15 కోట్లు.. పాజిటివ్ టాక్ వస్తే 20 కోట్లు... హిట్టయితే రూ.25 కోట్లు గ్యారెంటీ అన్న భరోసా వచ్చేసింది. నేనులోకల్ సింగం-3, నమో వేంకటేశాయ వచ్చినప్పటికీ కూడా ఫుల్ రన్లో రూ.25-30 కోట్ల మధ్య షేర్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఐదు రోజులకు ఏరియా వైజ్ కలెక్షన్లు:
Nizam - 603 lacs
Ceded - 195 lacs
Nellore - 42 lacs
Guntur - 116.2 lacs
Krishna - 114.22 lacs
West - 87.10 lacs
East - 141 lacs
Uttharandhra - 203 lacs
US USD - 780K.
మొత్తం సుమారు 19.6 కోట్లతో జస్ట్ ఐదు రోజుల్లో బాబుగాడు రచ్చ చేసి పడేశాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more