ప్చ్... టాప్-3 లో ఉన్నా లాభం లేదు | Khaidi No 150 3rd Position in US Box Office.

Khaidi n0 150 us box office collections

Khaidi No 150, Khaidi No 150 USA, Khaidi No 150 US Box Office Collections, Khaidi No 150 Overseas Collections, Khaidi No 150 Profits

Khaidi No 150 to be Third Biggest Hit in USA. But no Profitable like A Aa movie.

యూఎస్ భాక్సాఫీస్ వద్ద ఖైదీ పొజిషన్ ఏంటంటే...

Posted: 02/02/2017 03:15 PM IST
Khaidi n0 150 us box office collections

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 కలెక్షన్లు కుమ్ముడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రీఎంట్రీ తర్వాత అది కూడా ఓవర్సీస్ లో చిరు మ్యాజిక్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. మొదటి పదిరోజుల్లోనే రెండు మిలియన్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన ఖైదీ ఆ తర్వా స్క్రీన్లు భారీగా పడిపోవటం, కొత్త సినిమాలు రావటంతో నిదానించింది. బుధవారం వరకు 2.40 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో కొత్త రికార్డు క్రియేట్
చేయటమే కాదు, టాలీవుడ్ ఆల్ టైం లిస్ట్ లో నంబర్ 3 స్థానంలో నిలిచింది.

బాహుబలిని మినహాయిస్తే యూఎస్ లో శ్రీమంతుడు అత్యధిక కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నితిన్-త్రివిక్రమ్ ల అ.. ఆ..., నాన్నకు ప్రేమతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఇప్పుడు ఖైదీ అ.. ఆ... ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలవటం విశేషం. ఓ సీనియర్ హీరో చిత్రాల్లో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన సినిమా ఖైదీయే కావటం విశేషం. ఇంతకు ముందు ఊపిరికి అక్కడ మంచి స్పందనే వచ్చినప్పటికీ
ఈ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద డాలర్ల వర్షం మాత్రం కురిపించలేకపోయింది. బాహుబలి కంటే ఖైదీ తోపా?

అయితే ప్రీమియర్ షోలతోనే మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఖైదీ, లాంగ్ రన్ లో 3 మిలియన్ క్లబ్ దరిదాపుల దాకా వచ్చినప్పటికీ అ.. ఆ... మాదిరి లాభాలను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు ట్రేడ్ అనాలసిస్ట్ లు. మరోవైపు తెలుగు రాస్ట్రాల్లో కూడా ఖైదీ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నైజాం, సీడెడ్ ఏరియాల్లో ఇప్పటికే భారీ లాబాలు డిస్ట్రిబ్యూటర్స్ ఖాతాలోకి వచ్చి చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Khaidi No 150  US Box Office Collections  

Other Articles