దిల్ రాజు మరీ ఇంత ఓపెన్ గా చెప్పేశాడేంటి? | dil raju abou his involvement in movies.

Dil raju angry on suraj comments against heroines

Dil Raju, Director Suraj comments, Dil Raju about exposing, Director Suraj Dil Raju, Dil Raju about involvement, Dil Raju re shoot, Dil Raju angry

Star Producer Dil Raju angry on Suraj comments against heroines exposing. And also clear airs his involvement in his Movies.

హీరోయిన్ల ఎక్స్ పోజింగ్, సినిమాల్లో జోక్యంపై దిల్ రాజు

Posted: 01/21/2017 05:35 PM IST
Dil raju angry on suraj comments against heroines

కోలీవుడ్ లో ఆ మధ్య ఓ దర్శకుడు తిక్క కామెంట్లు చేసి చివాట్లు తిన్న విషయం గుర్తుందా? అదేనండీ విశాల్ కత్తి సండై(ఒక్కడొచ్చాడు) సినిమా డైరక్టర్ సూరజ్. కెరీర్ లో సరైన హిట్ లేని ఇతగాడు టాప్ హీరోయిన్లను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇచ్చేది ఎక్స్ పోజింగ్ చేయటానికే. అది చూడటానికే కదా జనాలు థియేటర్లకు వస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే అతనితో పని చేసిన తమన్నాతోసహా నయనతార లాంటి టాప్ హీరోయిన్ కూడా మండిపడింది.

అయితే వివాదం ముదరకముందే క్షమాపణలు చెప్పుకున్నాడు. అయినా రకుల్, రానా లాంటి వాళ్లు ఓ రెండు రోజుల పాటు అతగాడిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ ప్రస్తుతం పరిస్థితి సర్దుమణిగిందనుకోండి. ఇదిలా ఉంటే టాలీవుడ్ టాప్ ప్రోడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు.

ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రస్తావిస్తే... ''హీరోయిన్లకి డబ్బులిచ్చేది వాళ్లతో యాక్ట్‌ చేయించుకోవడానికి, బట్టలిప్పడానికి కాదు'' అంటూ తెలిపాడు. డబ్బులు ఇస్తున్నాం కదా అని ఎలా పడితే అలా కనిపించాలనటం కరక్ట్‌ కాదు''. అసలు అలాంటి ఆలోచనే తప్పు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని రకాల బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. అది తప్పేం కాదు ... అంటూ సురాజ్‌ కామెంట్లపై పరోక్షంగా ఫైర్ అయ్యాడు.

మరోవైపు సినిమాలో జోక్యం చేసుకునే అంశంపై అడిగిన మీడియాకు అంతే ఓపెన్ గానే సమాధానమిచ్చాడు. అవును.. నా ప్రతీ సినిమాలో నా హ్యాండ్ ఉండాల్సిందే. షూటింగ్ ను మొదటి నుంచి చూస్తూ ఉంటాను. అంతా అనుకున్నట్టే జరుగుతుంటే ఏమీ అడ్డు చెప్పను. అలా కాకుండా ఒకటి చెప్పి, మరొకటి తీస్తే మాత్రమే నిలదీయకుండా ఉంటానా?. ఆమధ్య ఓ సినిమాకి అలాగే జరిగితే, 35 రోజులు షూటింగ్‌ ను కాన్సిల్ చేయించి మరీ రీషూట్ చేయించా. అలా చేయకపోయి ఉంటే అది ఫ్లాప్ అయ్యేదే అంటూ చెప్పుకోచ్చాడు ఈ స్టార్ నిర్మాత. ఇంత చెప్పిన ఆయనగారు నాగ్ తో ఉన్న వైరం గురించి ఓపెన్ కాకపోవటం విడ్డూరమే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Heroines Exposing  Re shoot  Director Suraj  

Other Articles