టూమచ్: బాహుబలి రికార్డులు బ్రేక్.. శ్రీమంతుడే నెక్స్ట్ టార్గెట్ | Khaidi No 150 crosses Janatha Grarage Collections.

Baahubali collections crossed by khaidi no 150

Khaidi No 150, Khaidi Nizam Collections, Khaidi No 150 Baahubali Collections, Khaidi No 150 telugu states collections, Baahubali telugu states collections, Khaidi alla time records, Khaidi No 150 target, Khaidi No 150 Srimanthudu

Khaidi No 150 beats Baahubali record collections in telugu states. settled in third position after Srimanthudu.

సెన్సేషనల్ ఖైదీ బాహుబలి క్లీన్ స్వీప్

Posted: 01/21/2017 02:48 PM IST
Baahubali collections crossed by khaidi no 150

పదేళ్ల తర్వాత వచ్చినా తన స్టామినాలో ఇసుమంతైనా తగ్గలేదని మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో నిరూపించాడు. ఫాస్టెస్ట్ వందకోట్ల క్లబ్ లో చేరిన మూవీగా రికార్డులు క్రియేట్ చేయటమే కాదు, నాన్ బాహుబలి రికార్డులను కూడా దాదాపు చెరిపేసే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే... బాహుబలి కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ కావటం, పైగా తొమ్మిది రోజుల కలెక్షన్లతోనే కుమ్మేయటం.

అయితే టోటల్ కలెక్షన్ల విషయంలో కాకపోయినా కొన్ని ఏరియాల్లో బాహుబలిని ఖైదీ దాటేయటం చిరు క్రేజ్ కు దర్పణం పడుతోంది. ఫస్ట్ వీక్ లో కాకపోయినా, అది దాటిపోయాక మాత్రం ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి లో ఆ రికార్డులు చెల్లాచెదురు అయిపోయాయి.

కృష్ణాలో 4.13 కోట్లు వారం రోజుల్లో వసూలు చేయగా, అసలు ఆ ఏరియాలో ఇంత కలెక్షన్లు రాబట్టిన ఏకైక చిత్రం ఖైదీయే కావటం విశేషం. ఇక ఉత్తరాంధ్రలో కూడా 8.15 కోట్లతో కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. నైజాం కింగ్ గా పేరున్న చిరు రీఎంట్రీలో మళ్లీ సత్తా చాటాడు. కానీ తనకు తిరుగులేని పట్టున్న ఏరియాలో చిరు అనితర సాధ్యమైన కలెక్షన్లతో అద్భుతమైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 15.10 కోట్లు వసూలు చేసి ఎవరికీ అందన్నత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 62 కోట్ల షేర్ రాబట్టి (టోటల్ 82 కోట్లు) బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టేశాడు.

ఈ వీకెండ్ లో ఎలాగూ సినిమాలు లేవు. వచ్చేవారం సూర్య సింగం-3 ఒక్కటే, అది కూడా డబ్బింగ్ సినిమానే. ఈ పరిస్థితుల్లో ఖైదీ ప్రభంజనంఇలాగే కొనసాగితే మాత్రం శ్రీమంతుడు రికార్డులు కనుమరుగు అయిపోవటంతోపాటు, టాలీవుడ్ లో చిరు కొత్త హిస్టరీని క్రియేట్ చేయటం ఖాయంగానే చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Baahubali  Collections  Telugu States  

Other Articles