జస్ట్ ఫైవ్ డేస్.. 100 కోట్లు... దటీజ్ చిరు స్టామినా | Chiranjeevi stamina proved with Khaidi collections.

Khaidi no 150 joins in 100 crore club

Chiranjeevi, Khaidi No 150, Rs 100 Crore Club, Khaidi First Weekend Collections, Khaidi No 150 100 crores club, Khaidi century club, Mega re entry, Megastar Chiranjeevi, Khaidi No 150 Collections, Khaidi century Club, Chiru NIzam King

Chiranjeevi's Khaidi No 150 Crosses Rs 100 Crore Mark in Opening Weekend.

చిరు 150 సెంచరీ కొట్టేసిందోచ్

Posted: 01/17/2017 11:02 AM IST
Khaidi no 150 joins in 100 crore club

మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ కలెక్షన్లు ముగిసే సరికి 106 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత తెరపై చిరు మెరుపులు, దానికి తగ్గట్లే వినాయక్ అద్దిన హంగులు అన్నింటిని ప్రేక్షకులు ఆదరించారు. ముందుగా చెప్పుకున్నట్లే రికార్డులను సృష్టిస్తూ దూసుకెళుతోంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా .. ఓవర్సీస్ లోనూ ముఖ్యంగా యూఎస్ లో ఖైదీ తన దూకుడు చూపిస్తున్నాడు. ఈనెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలి రోజునే 47 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన విషయం తెలిసింది. నిజానికి అదే ఊపు కొనసాగి ఉంటే మూడు రోజుల్లోనే ఆ రికార్డు బద్ధలు అయి ఉండేదేమో.

కానీ, పోటీగా శాతకర్ణి, శతమానం భవతి రిలీజ్ కావటం, వాటికి మంచి టాక్ రావటం, పైగా స్క్రీన్లు తగ్గిపోవటంతో కాస్త ఆలస్యం అయ్యింది. ఇక 5 రోజులు పూర్తయ్యే నాటికి 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 106.12 కోట్ల గ్రాస్ ను .. 72. 51 కోట్ల షేర్ ను సాధించింది. టీజర్లు .. ఆడియో విషయంలోనే కాదు , వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉండటం విశేషం. రీమేక్, కథ .. కథనాల సంగతి
అటుంచితే .. చిరంజీవి ఛరిష్మానే దీనికి కారణమని సినీ ట్రేడ్ అనాలసిస్ట్ త్రినాథరావు అభిప్రాయపడ్డారు.

ఏరియా వైజ్ టోటల్ కలెక్షన్లు...

నైజాం రూ.20.35 కోట్లు
సీడెడ్ రూ.10.45 కోట్లు
ఆంధ్ర రూ.38.50 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వసూళ్లు రూ.69.30 కోట్లు


కర్నాటక రూ.12.40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.2.30 కోట్లు
ఓవర్సీస్ రూ.22.12 కోట్లు
వరల్డ్‌వైడ్ గ్రాస్ మొత్తం రూ.106.12 కోట్లు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Khaidi No 150  100 crores  First Weekend  Collections  

Other Articles