నందమూరి అభిమానుల దాహం తీరుస్తూ థియేటర్లలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ రావటంతో కలెక్షన్లు కుమ్ముకోవటం ఖాయమనే అనుకోవచ్చు. మనకు తెలియని ఓ చరిత్రను కళ్లకు కట్టేలా తెరకెక్కించాడని క్రిష్ పై అభినందనలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే సోషల్‌మీడియాలో శాతకర్ణి స్పెషల్ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
నిన్న సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పటం దగ్గరి నుంచి ఈరోజు సినిమా సూపర్బ్ గా ఉందంటూ వస్తున్న ట్వీట్ల గురించి ఓ లుక్కేద్దాం. ముందుగా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య పడటం లేదని చెప్పుకుంటున్న నాగ్ గురించి చూద్దాం. తనకి హిస్టారికల్ సినిమాలంటే చాలా ఇష్టమనీ .. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి హిస్టరీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నట్లు నాగ్ చెప్పారు. దర్శకుడు క్రిష్ తో పాటు టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో బాలయ్య-నాగ్ మధ్య మళ్లీ మాములు పరిస్థితి నెలకొంటుదని అభిమానులు అనుకుంటున్నారు.
Wishing #Balayya,@DirKrish &team all the best for #GautamiPutraSatakarni/I love watching historicals. Let this one create history!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 11, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బాబాయ్‌కి విష్ చెబుతూ అరగంట క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాబాయ్‌తో పాటు దర్శకుడు క్రిష్‌కు, సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఎన్టీఆర్. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా బాబాయ్‌కు అబ్బాయ్ ఆల్ ది బెస్ట్ చెప్పడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని ఈ ట్వీట్లతో అర్థమౌతోంది.
Wishing Babai and the whole team of #GPSK and @DirKrish all the best.#NBK100
— tarakaram n (@tarak9999) January 11, 2017
A landmark film for the Legend. Wishing Balayya Babai and the whole team of #GPSK the very best. #NBK100 will make us proud
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 11, 2017
ఇక బాలకృష్ణ సినిమాకు తెలుగు చిత్ర యువ హీరోలు తమ ట్వీట్లతో బ్రహ్మరథం పడుతున్నారు. హీరో మంచు మనోజ్ ఒక గంట క్రితం, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ 40 నిమిషాల క్రితం చిత్రంపై స్పందించారు. "డేరింగ్ డాషింగ్ నటసింహ బాలయ్య అన్నకు, క్రిష్ బాబాయ్ కి థ్యాంక్స్. శరణమా... రణమా" అని మనోజ్ ట్వీట్ చేయగా, "జీపీఎస్కే గురించి గొప్పగా రిపోర్టులు వస్తున్నాయి. చిత్ర బృందానికి అభినందనలు. బాలయ్యా... మీరు మాలో చాలామందికి ఆదర్శం" అని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యానించాడు. మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పగా, రానా ఏకంగా తన పేరుకు తల్లి పేరును జత పరిచి క్రిష్ కు అభినందనలు తెలియజేశాడు.
Happy Sankranthi ! Best Wishes to Gautami Putra Satakarni & Shathamanam Bhavathi !
— Allu Arjun (@alluarjun) January 11, 2017
Hearing great reports about #GPSK congratulations to the whole team and @DirKrish, #NBK garu you are an inspiration to many of us pic.twitter.com/ps4f1H1EE6
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 12, 2017
Hearing awesome things about #GautamiPutraSatakarni . Getting to the cinemas as fast as I can!! @DirKrish the profile name in your honour!!
— Rana Daggubati (@RanaDaggubati) January 12, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more