దశాబ్దం అయినా ఖైదీకి అదే క్రేజ్.. అంతకు మించే! | Chiru craze after 10 years at theaters.

Khaidi no 150 release special

Khaidi No 150, Khaidi No 150 first day, Khaidi No 150 release date, Khaidi No 150 special, Khaidi No 150 specialities, Khaidi No 150 guest roles, Khaidi No 150 review

Khaidi No 150 theaters craze shows stamina of Megastar Chiranjeevi even after decade.

మెగా రీఎంట్రీ సమ్ థింగ్ స్పెషల్స్

Posted: 01/10/2017 04:25 PM IST
Khaidi no 150 release special

మెగా స్టార్ చిరంజీవి కోసం ఓ రీమేక్ కథను ఎంచుకున్నారన్న విమర్శల దగ్గరి నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాలు రేపిన కామెంట్ల దాకా ఖైదీ ప్రస్థానం బాగానే జరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్ రారాజు తిరిగి తెరపై సందడి చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. అందుకే రీఎంట్రీని ఓ సేఫ్ సైడ్ మెసేజ్ ఓరియంటల్ అయితేనే బావుంటుందని డిసైడ్ అయ్యింది మెగా కాంపౌండ్.

అందుకు తగ్గట్లే సొంతంగా కొణిదెల పేరిట ఓ ప్రోడక్షన్ హౌజ్ పెట్టడమే కాదు, ఓవైపు తన సినిమాను చూసుకుంటూనే, తండ్రి 150 చిత్ర పనులను తానే దగ్గరుండి చూసుకున్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మాస్ పల్స్ పట్టిన దర్శకుడు వినాయక్ చేతిలోనే మళ్లీ ఈ రీమేక్ ను పెట్టాడు. ఆరు నెలల పాటు సాగిన షెడ్యూళ్లతో మొత్తానికి సినిమా ముగిసింది. చిరు ఫ్యాన్స్ కోరుకునే అన్ని రకాల మాస్ మసాలా ఎలిమెంట్స్తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించారు చిత్రయూనిట్. చిరు సినిమా వస్తుందంటే పదేళ్ల క్రితం ఎలాంటి పరిస్థితి కనిపించిందో ఇప్పుడు అదే రేంజ్ సంబరాలు.. కాదు కాదు.. అంతకు మించి కనిపిస్తున్నాయ్.

మరోవైపు బాస్ సంచలనాలు కూడా కొనసాగాయి. ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గరి నుంచి మొన్న వచ్చిన ట్రైలర్ దాకా అన్ని రికార్డులను బద్ధలు కొట్టాయి. కేవలం పాటలకే వచ్చిన స్పందన చూసి క్రిటిక్స్ నోళ్లు తెరిచారు. మరి తెరపై మెరుపులు ఎలా ఉండబోతున్నాయోనని అంతా ఆత్రంగా చూస్తున్నారు. కొడుకు, తమ్ముడికి కూతురిగా చేసిన హీరోయిన్, పైగా తమ్ముడితో కూడా ఆడిపాడింది. అయినా చిరు పక్కన భలే సెట్ అయ్యింది. బహుశా ఇన్ని తరాలతో చేసిన హీరోయిన ఒక్క కాజల్ ఏమో. ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గరి నుంచి మొన్న వచ్చిన ట్రైలర్ దాకా అన్ని రికార్డులను బద్ధలు కొట్టాయి. స్టైల్ లో, డాన్సుల్లో మునుపటి కంటే మెరుగైన తేజస్సు.

కేవలం పాటలకే వచ్చిన స్పందన చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి తెరపై మెరుపులు ఎలా ఉండబోతున్నాయోనని మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు కొడుకు, మెగా పవర్ స్టార్ ఓ గెస్ట్ రోల్, 30 సెకన్లపాటు చిందులేయనున్నాడు. ఇంతలో మరో షాక్,, వీరాభిమాని అయిన అల్లుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మరో స్పెషల్ రోల్ లో మెరుస్తాడనే వార్త. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఖైదీని ఎవరైనా వదిలేస్తారా? అసలు ఇదంతా ఎందుకు కేవలం చిరు కనిపిస్తాడు అది చాలదు.! అందుకే మొత్తం థియేటర్లు హౌజ్ ఫుల్ అయిపోయాయి. పండగకు రెండు రోజుల ముందే పెద్ద పండగ తెచ్చేస్తున్నాడు. ఫ్యాన్స్! గెట్ రెడీ ఫర్ బాస్....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Chiru  Craze  after 10 years  

Other Articles

 • Sai pallavi horror movie kanam gets final release date

  నెలాఖరున భయపెట్టేస్తానంటున్న సాయిపల్లవి..

  Apr 21 | ప్రమమ్ చిత్రంలోనే మంచి నటనాభియనం వున్న నటిగా పేరు సంపాదించిన నటి సాయిపల్లవికి అటు తమిళం ఇటు తెలుగు విపరీతమైన క్రేజ్ వుంది. ఇక ఫిదాలో అమె నటనకు యావత్ తెలుగు ప్రేక్షకుడు ఫిధా... Read more

 • Karate kalyani questions casting couch srireddy

  శ్రీరెడ్డికి కరాటే కల్యాణి ప్రశ్నల వర్షం..

  Apr 21 | టాలీవుడ్ లో పెనుదుమారం రేపిన కాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. మహిళలకు సినీ రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. లీకులు రిలీస్ చేస్తున్న శ్రీరెడ్డి అలియాస్ విమలపై మరో టాలీవుడ్ నటి కరాటే... Read more

 • Mass maharaja ravi teja s nela ticket teaser to be released

  'నేల టిక్కెట్టు' టీజర్ ముహూర్తం రెడీ

  Apr 21 | మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపోందుతున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. రాజా ది గ్రేట్ చిత్రం హిట్ అయిన తరువాత మంచి జోరుమీదున్న రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం నేల టిక్కెట్టు,  కల్యాణ్... Read more

 • Jeevitha rajashekar complaints on sandhya for allegations

  మహిళా సంఘం నేత సంధ్యపై.. పోలీసులకు పిర్యాదు చేసిన జీవిత

  Apr 17 | టాలీవుడ్ లో కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై చర్చ సందర్భ:గా తన భర్త పట్ల, తన పట్లు జుగుప్సాకరమైన అరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్యపై టాలీవుడ్ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్... Read more

 • Pawan kalyan tollywood fans gave befiitting reply to sri reddy

  పవన్ కల్యాన్ సీనీ అభిమానగణం.. ఏమన్నారో తెలుసా..?

  Apr 17 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఇందుగలరు.. అందులేరు అన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కనబడు అన్నట్లుగా స్వతహాగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోలుగా వెలుగొందుతున్న వారు కూడా అయన అభిమానులే అనడంలో సందేహం... Read more

Today on Telugu Wishesh