ప్రభాస్ నమ్మకం బాహుబలి కంటే విలువైంది | Rajamouli on Baahubali the Conclusion Pumpkin.

Baahubali 2 shooting completed

Baahuali-2, Baahubali the conclusion, Baahubali-2 shoot completed, Prabhas sword down, Rajamouli about Prabhas, Baahubali the Conclusion Pumpkin, Baahubali last day shoot, Rajamouli special thanks to Prabhas,

Prabhas’ journey comes to end, lays down sword after 613 days of shoot. Baahubali the Conclusion Pumpkin.

బాహుబలి షూటింగ్ ది కంక్లూజన్

Posted: 01/06/2017 04:38 PM IST
Baahubali 2 shooting completed

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కత్తి తిప్పటం ఆపేశాడు. మొత్తానికి బాహుబలి షూటింగ్ కంక్లూజన్ కి చేరింది. పాత సంవత్సరంలోనే షూటింగ్ ముగించేద్దామనుకున్నప్పటికీ ఓ వారం ఆలస్యంగా గుమ్మడికాయ కొట్టేసింది జక్కన్న అండ్ టీం. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళియే తన ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించాడు.

'ప్రభాస్ తో షూటింగ్ పూర్తయిపోయింది. మూడున్నరేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేశాం. థ్యాంక్స్ డార్లింగ్.. ఈ ప్రాజెక్టుపై నువ్వు నమ్మినంతగా వేరెవ్వరూ నమ్మకం ఉంచలేదు. అదే అన్నికంటే విలువైనది' అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక షూటింగ్ లాస్ట్ డేలో చిత్ర యూనిట్ అంతా కలిసి దిగిన ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. పూర్తి టెక్నీషియన్స్ తో ఉన్న ఆ ఫోటోలో సెంథిల్, రాజమౌళి తనయుడు కార్తీకేయ తదితరులు ఉన్నారు.

ఇక మిగిలింది సీజీ వర్క్, రికార్డింగ్ చకచకా పూర్తి చేసి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ప్రమోషన్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు దర్శకధీరుడు. మరోవైపు ఈ నెల 25న షారూఖ్ ఖాన్ రాయిస్ రిలీజ్ ఉంది. అప్పుడే టీజర్ ను రిలీజ్ చేయాలన్న ఫ్లాన్ లో (సంక్రాంతికి కూడా కావొచ్చు!) చిత్ర యూనిట్ భావిస్తోందంట. ఇక ఎలాగూ ప్రభాస్ ఫ్రీ అయ్యాడు గనక మిగిలింది సుజిత్ సినిమా స్టార్ట్ చేయటం, అంతకు మించి డార్లింగ్ పెళ్లి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali-2  Last day shoot  Pumpkin  Rajamouli  praise  prabhas  

Other Articles