బ్రిట్నీ స్పియర్స్ అసలు ఎలా చనిపోయింది? | Britney Spears Isn't Dead.

Britney spears victim of sony music twitter hack

Sony Music, Britney Spears' death, Britney Spears alive, Britney Spears Fake News, Britney Spears hack, Britney Spears twitter, Britney Spears Sony Music Global, Sony Twitter Hack, Britney Spears Road Accident

Hacked Sony Music accounts spread false news of Britney Spears' death.

బ్రిట్నీ స్పియర్స్ ను యాక్సిడెంట్ లో చంపేశారు

Posted: 12/27/2016 11:06 AM IST
Britney spears victim of sony music twitter hack

హాలీవుడ్ నటి, పాపులర్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ చనిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో పెను కలకలాన్నే రేపింది. ప్రఖ్యాత మ్యూజిక్ సంస్థ సోనీ మ్యూజిక్ గ్లోబల్ తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఈ వార్తను గత రాత్రి ప్రచురించింది. ఓ యాక్సిడెంట్ లో బ్రిట్నీ చనిపోయిందని, మరిన్ని వివరాలు తెలియజేస్తామని, RIP అంటూ ఓ ట్వీట్ ఉంచింది.

అంతే ఆమె అభిమానులంతా ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయారు. అయితే అదంతా నిజంకాదని సీఎన్ఎన్ మరో వార్తను ప్రచురించింది. 35 ఏళ్ల బ్రిట్నీ క్రిస్మస్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసింది. దీనికి కారణం సోనీ మ్యూజిక్‌ గ్లోబల్‌ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌ కు గురి కావటమే అని అనుమానిస్తున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు సోనీ సంస్థ ప్రతినిధి నిరాకరించారు.

Britney death tweets

ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీల చావు వార్తలు ఈ మధ్య తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. యే దిల్ హై ముష్కిల్ లో రొమాన్స్ కారణంగా బచ్చన్ ఫ్యామిలీలో కలతలు రేగి ఐశ్వర్య రాయ్ సూసైడ్ చేసుకుందని, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారంటూ ఈ మధ్య ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించటంతో వైరల్ అయిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pop Singer  Britney Spears  Death Tweets  Sony Music Global  Twitter  Hacked  

Other Articles