అదా తల్లి వీడియో.. పూరీ ఫిదా.. అందరికీ షాక్ | Adah Sharma's Mother Amazing workout shocks you.

Adah sharma mother s stunning acrobatics

Adah Sharma, Adah sharma mother workout video, Puri Jagannath Adah Sharma Mother, Adah Sharma shocking video, Heroine mother shocking video, Adah mother gym, Adah Sharma's Mom Performing Pole Acrobatics

Adah Sharma Posted her mother's workout video. Puri Jagannath reacted for that tweet.

అదా మదర్ అందరికీ షాకిస్తోంది...

Posted: 12/20/2016 01:24 PM IST
Adah sharma mother s stunning acrobatics

సాధారణంగా అవకాశాల కోసం అప్ కమింగ్ హీరోయిన్లు సైజులను కంట్రోల్ పెట్టుకోవటం తరచూ మనం చూస్తున్నదే. టాప్ రేసులో కొనసాగుతున్న హీరోయిన్లు అయితే ఆ పొజిషన్ మారకుండా ఉండేందుకు గంటల తరబడి జిమ్ లలోనే గడిపేస్తుంటారు. అయితే ఇక్కడ హీరోయిన్ కాకుండా వాళ్ల అమ్మ వర్కవుట్ ల మీద తెగ శ్రద్ధ పెడుతోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకు అనుకుంటున్నారా?

హర్ట్ ఎటాక్ బ్యూటీ అదాశర్మ తన సోషల్ మీడియాలో ఓ వీడియో ఉంచింది. అందులో ఆమె మదర్ పోల్ విన్యాసాలు చేస్తు అందరినీ అబ్బుర పరిచింది. మల్లకంబ్‌ వర్కవుట్ అని పిలుచుకునే ఈ వీడియోలో ఓ పోల్ లాంటి దానినితో వ్యాయామం చేయటం ప్రత్యేకత. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ అయిన అదా మదర్ ఈ ఫీట్లు చేయటం పెద్ద విశేషం కాకపోయినప్పటికీ, 40 ఏళ్ల వయసులో కూడా ఆమె ఇలా చేయటం నిజంగానే వండర్ అని అంతా అంటున్నారు.

 

ఇక తన తల్లి వర్కవుట్ వీడియోను గర్వంగా ట్విట్టర్ లో  షేర్ చేసిన అదా ఆమె ఎంతో స్ట్రాంగ్ అంటూ ఓ ట్వీట్ చేసింది. దానికి స్పందించిన పూరీ జగన్నాథ్ అవును.. ఆమె నిజంగా గ్రేట్ అర్థం వచ్చేలా రీ ట్వీట్ చేశాడు.ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adah Sharma's Mom  Performing Pole Acrobatics  Adah Sharma posted video  

Other Articles