శ్రీమంతుడు, గ్యారేజ్ టైంలో అదే సీన్... మరి ఇప్పుడు? | Mahesh Koratala second movie release date announced.

Mahesh babu new movie release date fix

Mahesh Babu New movie, Koratala-Mahesh second movie, CM telugu movie release date, Mahesh new movie release date, Mahesh Koratala release Date, DVV Danayya Mahesh Movie, Mahesh Babu Koratala Movie, Mahesh babu September 22nd 2017

Mahesh Babu-Koratala second movie release date Locked. The makers of the film have decided to release the movie on September 22nd 2017.

మహేష్-కొరటాల మూవీ రిలీజ్ డేట్ అప్పుడేనా?

Posted: 12/07/2016 04:11 PM IST
Mahesh babu new movie release date fix

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం రిలీజ్ డేట్ అపీషియల్ గా అనౌన్స్ అయిపోయింది. అయితే అది మురగదాస్ చిత్రం కాదండోయ్. స్టార్ డైరక్టర్ కొరటాల శివ దర్వకత్వంలో చేయబోయే సినిమా తేదీ. అవును.. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి కూడా వెళ్లని సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ ఇచ్చేశాడు నిర్మాత డీవీవీ దానయ్య.

సినిమా సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్న కొరటాల షూటింగ్ విషయంలో కూడా ఎలాంటి అలసత్వం ప్రదర్శించొద్దని డిసైడ్ అయ్యాడంట. అందుకే నిర్మాతలను ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పేసి దానిని అఫీషియల్ గా అనౌన్స్ చేయించేశాడు. సెప్టెంబర్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు యూనివర్సల్ మీడియా చెప్పేసింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంఛ్ అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కి వెళ్లక ముందే రిలీజ్ డేట్ కూడా చెప్పేయటం విశేషం. అయితే ఇంతకు ముందు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ విషయంలో కూడా కొరటాల ఇలాగే ముందు డేట్లు చెప్పి ఆ తర్వాత మార్చేసుకున్నాడు. దీంతో ఆ టైంకి పరిస్థితులను బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు, ఇందుకోసం సీఎం అనే టైటిల్ ను కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నా వాటిపై అదికారికంగా ప్రకటన లేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ బై లింగువల్ చిత్రంపై నెలకొన్న సస్పెన్స్ కి మేకర్లు తెరదించారు. జవనరి 1నే టైటిల్ కమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ లో నిర్మాతలైన ఎన్టీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ప్రకటించేశారు. సుమారు వంద కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు, మురగదాస్ లు కూడా సహ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Koratala Siva New Movie  Release Date announced  

Other Articles