ఆయన ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు | Dilip Kumar again hospitalised

Veteran actor dilip kumar hospitalised

Dilip Kumar, Dilip Kumar serious, Dilip Kumar health, Dilip Kumar hospitalised, Dilip Kumar serious situation, Dilip Kumar Leelavathi Hospital, Dilip Kumar news, Dilip Kumar biography

Legendary actor Dilip Kumar hospitalised,

లెజెండరీ యాక్టర్ కి మళ్లీ సీరియస్?

Posted: 12/07/2016 08:52 AM IST
Veteran actor dilip kumar hospitalised

బాలీవుడ్ దిగ్గజం, ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం 94వ పడిలోకి ప్రవేశించనున్న ఆయన కుడికాలు వాపు, తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళవారం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. అయితే దిలీప్ ఆరోగ్యం కొద్దిగా క్షీణించడంతో వైద్యులు ఆయనని అబ్జర్వేషనల్ లో ఉంచినట్టు సమాచారం. ఆసుపత్రిలో దిలీప్ బాగోగులను ఆయన భార్య సైరాభాను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సైరా మీడియాకు తెలిపారు.

దిలీప్ కుమార్ ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, జన్మదినోత్సవానికి ముందే ఆయనను ఇంటికి తీసుకువెళ్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్నిసంవత్సరాలుగా దిలీప్ కుమార్ తరచూ అనారోగ్యం పాలవుతూ ఆస్పత్రిలో చేరుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇదే ఆస్పత్రిలోనే చికిత్స పొందారు.

బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన దిలీప్‌కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించారు. ఆయన అసలుపేరు యూసుఫ్‌ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పడకపోవపడంతో.. ఇంటినుంచి వచ్చేసి పుణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Legendary actor  Dilip Kumar  Hospitalised  Serious  

Other Articles