సింగం-3 సినిమాకు రాజకీయాలతో సంబంధం ఏంటి? | Singam based on real political incidents.

Singam 3 inspired by real life incidents

Suriya NTR, NTR Singam 3, Senior NTR, Hero Suriya, Singam 3 political, Singam 3 story change, Singam 3 real incidents, Singam 3 hero, Singam 3 suriya, Singam 3 release date, suriya singam 3 promotion, Singam 3 telugu promotion

Suriya says Singam 3 inspired by real life incidents in NTR ruling.

సింగం-3 కి సీనియర్ ఎన్టీఆర్ తో సంబంధం ఏంటి?

Posted: 12/06/2016 03:10 PM IST
Singam 3 inspired by real life incidents

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస ఫ్లాపులతో కష్టాల్లో ఉన్నప్పుడల్లా సింగంతో ఆదుకుంటుంటాడు దర్శకుడు హరి. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో రెండు సినిమాలు వచ్చి దుమ్ము లేపగా, ఇప్పుడు మూడో పార్ట్ రిలీజ్ కు రెడీ అయిపోయింది. ధ్రువ కోసం మరో వారం రిలీజ్ కు పొడిగించుకుని 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో ప్రమోషన్ లో బిజీ బిజీ అయిపోయాడు సూర్య.

ఇక తమిళ్ కన్నా తెలుగులోనే ఎక్కువ మార్కెట్ చేసే ఈ హీరో ప్రచారం విషయంలోనూ ఇక్కడే ఎక్కువ కాంసంట్రేషన్ చేస్తుంటాడు. గత చిత్రం 24 తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు నిదర్శనం. ఇక సింగం-3 గురించి మాట్లాడుతూ నిజానికి కథ వాస్తవ ఘటనల ఆదారంగా రూపొందిందని చెబుతున్నాడు. ఎంజీఆర్, ఎన్టీఆర్ హయాంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు హరి పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో ఈ కథను తెరకెక్కించాడంట.

నిజానికి సినిమాను మిలిటరీ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కించాలని హరి అనుకున్నాడు. కానీ, చివరికి సూర్యతో ఖాకీ డ్రెస్ తోనే వర్కవుట్ అవుతుందని అభిప్రాయం మార్చుకున్నాడంట. మొదటి సినిమా సమయంలో రెండో దానికి అవకాశం ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడు మూడో పార్ట్ కూడా వచ్చేసింది. పవర్ ఫుల్ కథలతోనే ఇది సాధ్యమయ్యిందని అంటున్నాడు సూర్య.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Suriya  Singam3  Relase date  

Other Articles