ఐష్ సూసైడ్ అటెంప్ట్.. ఏం జరిగింది? ! Aishwarya Rai falls victim to viral death hoax.

Aishwarya rai s death hoax goes viral

Aishwarya Rai, Aishwarya Rai suicide, Aishwarya Rai death news, Aishwarya Rai death hoax, Aishwarya Rai death

Aishwarya Rai falls victim to viral death hoax; false reports suggest the actor ended her life.

ఐశ్వర్య రాయ్ సూసైడ్ ఎంత ఘోరంగా అంటే...

Posted: 12/05/2016 03:49 PM IST
Aishwarya rai s death hoax goes viral

సొషల్ మీడియా పుణ్యమాని వార్తల కన్నా గాసిప్ లే ఎక్కువగా, త్వరగా వైరల్ అయిపోతున్నాయి. సెలబ్రిటీల విషయంలో దేనైనా సరే ఒకటికి రెండు సార్లు పరిశీలించకుండానే, ఎలాంటి ఆధారాలు లేకుండా వారిపై ఫేక్ వార్తలు రాసేస్తున్నారు. గతంలో హాలీవుడ్ ల విషయంలో ఎక్కువగా కనిపించేది. అంతెందుకు బీన్ ఫేం అటిక్ సన్ చనిపోయాడంటూ కొన్ని రోజుల క్రితం ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇక ఈ సంప్రదాయం ఇప్పుడు బాలీవుడ్ కు పాకింది. ఏకంగా అందాల భామ ఐశ్వర్య రాయ్ చనిపోయిందంటూ పుకార్లు రేపింది.

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య చేసుకుందంటూ రేగిన పుకారు. సోషల్ మీడియాలో కలకలం రేపింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో రణ్ బీర్ కపూర్ తో అత్యంత సన్నిహితంగా నటించిన ఐశ్వర్య దంపతుల మధ్య కలతలు రేగాయని, ఈ నేపథ్యంలో ఐష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని పుకార్లు షికార్లు చేశాయి. ఆమె ఆత్మహత్యను సీక్రెట్ గా ఉంచారని, వివాదాలంటే ఇష్టం ఉండని అమితాబ్ కుటుంబం మౌనంగా ఉందని పేర్కొంటూ పుకార్లు షికార్లు చేశాయి.

అయితే సోషల్ మీడియా కావటంతో యవ్వారం అంతగా బయటికి పొక్కలేదు. ఈ నేపథ్యంలో వీకెండ్ లో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో ఆమె కనిపించడంతో ఆమె ఆత్మహత్య పుకారు అన్న విషయం అర్థమైంది. మరి ఇంత చీప్ గా వార్తలు రాసేశారా అని జనాలు చీదరించేసుకుంటున్నారు.

కాగా, గతంలో చాలా మంది బాలీవుడ్ నటులు చనిపోయారంటూ పుకార్లు రేగిన విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్, ఖాదర్ ఖాన్, శశికపూర్ తదితరుల విషయంలో ఇలాంటి వార్తలే వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  death  fake news  

Other Articles