అప్పట్లో ఇద్దరు.. మొత్తం యాక్షన్ ట్రైలరే... | Appatlo Okadundevadu official trailer out

Appatlo okadundevadu trailer out

Nara Rohith, Nara Rohith Appatlo Okadundevadu, Appatlo Okadundevadu trailer, Appatlo Okadundevadu official trailer, Appatlo Okadundevadu vishnu sri, Appatlo Okadundevadu Nara Rohit, Appatlo Okadundevadu new trailer

Nara Rohith's latest production venture, Appatlo Okadundevadu, trailer has been released.

అప్పట్లో ఒకడుండేవాడు అంతా యాక్షన్ డ్రామానే...

Posted: 12/05/2016 03:17 PM IST
Appatlo okadundevadu trailer out

నారా రోహిత్ తాజా చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. డిఫరెంట్ చిత్రాలతో అలరిస్తున్న రోహిత్ ఇప్పుడు కూడా ఓ వైవిధ్యభరితమైన సబ్జెక్ట్ తోనే రాబోతున్నాడు. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా 1990లో జరిగిన ఓ రియల్ ఘటనల ఆధారంగానే సినిమా ఉండబోతుంది. ఆ విషయం ట్రైలర్ లో కూడా చూపించేశాడు దర్శకుడు అయ్యారే ఫేం సాగర్ చంద్ర.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఓ వ్యక్తి విష్ణు శ్రీ గ్యాంగ్ తో రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం మాట్లాడుతుంటాడు. వెంచర్ ఎక్కడంటే కూకట్ పల్లి అనటంతో అక్కడే ఉన్న బ్రహ్మజీ అంతా అడవిలో ఏం బిజినెస్ అంటూ అప్పటి పరిస్థితులను చెబుతాడు. అలా మొదలైన ట్రైలర్ చివరి దాకా నాన్ స్టాప్ యాక్షన్ తోనే కొనసాగుతుంది. ఓ క్రికెటర్ అయిన హీరో అనుకోని పరిస్థితుల మధ్య రౌడీ షీటర్ గా మారటం, ఆపై ఓ పోలీసాఫీసర్ తో తగువు పెట్టుకోవటం ఇలా వారిద్దరి మధ్య జరిగే వార్ నేపథ్యంతోనే సినిమా ఉంది.

 

మొదటి నుంచి చివరి దాకా కూడా యాక్షనే అంటూ బ్రహ్మాజీ పేల్చే డైలాగ్ కూడా ఇందులో ఉంది. 2015 మిస్ ఫెమినా ఇండియా తన్యా హోప్ ఇందులో హీరోయిన్ గా కనిపించబోతుంది. నారా రోహిత్ సొంత బ్యానర్ ఆరాన్ మీడియా వర్క్స్ కూడా ఈ సినిమాలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Appatlo Okadundevadu  trailer  nara rohit  Vishnu sri  

Other Articles