కటప్ప సీక్రెట్ ఆ ప్రభుత్వానికి తెలిసిపోయింది.. అయినా చెప్పరంట! Rajamouli reveals why Katappa killed Baahubali to Rajyavardhan Rathore.

Union minister knows why kattappa killed baahubali

Minister of State for Information and Broadcasting, Rajyavardhan Singh Rathore, Rajyavardhan Singh Rathore Kattappa, Rajyavardhan Singh Rathore Rajamouli, Rajamouli Kattappa secret, Rajyavardhan Singh Rathore, Information and Broadcasting Minister Rajyavardhan Singh, Rajyavardhan Singh Rathore Why Kattappa kill baahubali

Minister of State for Information and Broadcasting Rajyavardhan Singh Rathore knows, why Katappa killed Baahubali.

కటప్ప సీక్రెట్ దేశభద్రతతో లింకు

Posted: 11/29/2016 12:20 PM IST
Union minister knows why kattappa killed baahubali

బాహుబలి సినిమా యావత్ దేశ ప్రజలను ఆకట్టుకోవటంతోపాటు, పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుమారు 600 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రిలీజ్ అయిన రోజు నుంచి నేటి దాకా హాట్ టాపిక్ గా నిలవటానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న ఇది. రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో దాని మీద పడినన్నీ సెటైర్లు మరేయితర సినిమాపై కూడా పడి ఉండకపోవచ్చు. సినిమాలో సీరియస్ అయిన ఈ టాపిక్ నెటిజన్లపాలిట మాత్రం సిల్లీగా మారిపోయింది. ఇక ఈ ప్రశ్నకు సమాధానం చివరికి చిత్ర యూనిట్ లో ఇద్దరు ముగ్గురికి తప్ప ఎవరికీ తెలీదు. రాజమౌళికి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు, ప్రభాస్‌కు, సత్యరాజ్‌లకు మాత్రమే తెలుసు. అంతే రహస్యంగా షూటింగ్ కూడా చేశారు. ఆ మధ్య తమన్నా నాక్కూడా తెలుసని చెప్పినప్పటికీ, ఆ పై ఉత్తదేనని చెప్పుకొచ్చింది. కానీ, దేశ భద్రత కోసం ఆ సీక్రెట్ ను రాజమౌళి ఓ కేంద్ర మంత్రికి చెప్పేశాడంట.
 
కేంద్ర సమాచార శాఖా మంత్రి(మినిస్టర్ ఆఫ్ స్టేట్) రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌. స్వయంగా రాజమౌళే తనకు ఆ చెప్పాడని అంటున్నాడు. గోవాలో జరుగుతున్న 47వ ఇఫీ(IFFI) ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన ఆయన ఈ విషయం చెప్పారు. ‘బాహుబలి లాంటి గొప్ప చిత్రాన్ని అందించినందుకే కాదు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఆ సీక్రెట్ నాకు చెప్పినందుకు రాజమౌళికి థ్యాంక్స్‌.  మా ప్రభుత్వానికి అన్నీ తెలియాలి. అలాగే దేశ భద్రత కోసం తెలిసిన రహస్యాలను మా ప్రభుత్వం కాపాడుతుంది. ఆ విషయం రాజమౌళికి తెలుసు. అందుకే నాకు చెప్పారు. ఈ సీక్రెట్‌ నా దగ్గరే సేఫ్‌గానే ఉంటుంద’ని ఆయన వ్యాఖ్యానించాడు. సరదాగా చేశాడో.. సీరియస్ గా చేశాడో తెలీదుగానీ రాథోడ్ చేసిన ఆ వ్యాఖ్యలు నవ్వుల పువ్వులు పూయించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajyavardhan Singh Rathore  Kattappa Secret  Rajamouli  

Other Articles