వెంకీ సినిమాలో పవన్! రాస్తే మీనింగ్ ఉండాలి | Venky using Pawan Kalyan Reference in Guru

Gabbar singh cut out in venky movie

Pawan kalyan, Venkatesh, Hero Venkatesh, Pawan Kalyan Reference, Pawan Kalyan Reference in Movies, Movies list with Pawan kalyan Reference, Pawan kalyan Gabbar Singh Cut Out, Gabbar Singh Cut Out, Venkatesh Pawan Kalyan, Pawan Kalyan And Venkatesh, Guru Movie, Guru Movie 2017, Guru Movie 2016, Pawan Kalyan in Guru Movie, Pawan in Venky Movie

Pawan Kalyan Reference using in Venkatesh upcoming Movie Guru.

గబ్బర్ సింగ్... జస్ట్ కటౌట్ గురూ

Posted: 11/14/2016 11:39 AM IST
Gabbar singh cut out in venky movie

సినిమాల్లో మరో హీరో రిఫరెన్స్ లు వాడుకోవటం అనేది ప్రారంభించింది ముమ్మాటికీ మెగాస్టారే. 90వ దశకంలో ఈ ఫీవర్ మరీ ఎక్కువగా కనిపించేది. ఆ తర్వాత స్ఫూఫ్ ల పుణ్యమాని భాషాభేదం లేకుండా అందరూ స్టార్ లను వాడుకోవటం కనిపిస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. పవన్ కళ్యాణ్ రిఫరెన్సులే ఈ మధ్య వస్తున్న చాలా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నాయి.  హీరో ఎవరైనా ఫర్వాలేదు అందులో జస్ట్ పవన్ కి సంబంధించిన పాటో, ఫోటో, ఆడియో క్లిప్ ఏది వినిపించినా ఫర్వాలేదు. ఇక అరుపులే...

సీనియర్ హీరో వెంకటేష్ కూడా అందుకు మినహాయింపు కావటం లేదు. ప్రస్తుతం వెంకీ గురు సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మాధవన్,  చిత్రం ఇటు తమిళ్, అటు బాలీవుడ్ లోనూ మంచి ఫలితాన్నే అందుకుంది.  తమిళంలో 'ఇరుది సుట్రు' లో హీరోయిన్ రితిక సింగ్ ధనుష్ కి వీరాభిమాని ఉంటుంది. అందుకే సినిమాలో చాలా సార్లు ధనుష్ పేరు, డైలాగులు వాడటం కూడా కనిపిస్తుంది. దీంతో తెలుగు వర్షన్ కి వచ్చేసరికి దానిని పవన్ కి షిఫ్ట్ చేశారంట.

రితిక సింగ్ పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ గా కనిపించటమే కాదు, ఓ సీన్ లో పవన్ గబ్బర్ సింగ్ పోస్టర్ కూడా కనిపిస్తుందట. ప్రస్తుతం ఆ సన్నివేశాలనే చిత్రీకరిస్తోంది యూనిట్. వెంకీ-పవన్ లకు వ్యక్తిగతంగా మాంచి ఫ్రెండ్ షిప్ ఉందన్నది అందరికీ తెలిసిందే. దీంతో వెంకీ సినిమా మళ్లీ పవన్ అంటూ నటిస్తున్నాడేమో అన్నంతలా భ్రమచేసేలా హెడ్డింగులు పెట్టేయటం కామెడీగా ఉంది. తమిళ్ లో ధనుష్ పై మాధవన్ సెటైర్లు వేసే సన్నివేశాలు ఉంటాయి. మరి తెలుగులో వాటిని ఉంచుతారో? కట్ చేసేస్తారో? చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Gabbar Singh Cut Out  Venky Guru Movie  

Other Articles