క్లైమాక్స్ కాస్త విషాదంగా ఎందుకు మారింది? | Two Kannada actors feared drowned after film stunt goes wrong

Two kannada actors feared drowned after film stunt goes wrong

Maasti Gudi helicopter stunt, Maasti Gudi climax, two actors drowned, Duniya Vijay escape, Two Kannada actors feared drowned, Kannada film stunt goes wrong, Uday and Anil final moments, Uday and Anil Death video, Film Climax stunt real deaths, Uday and Anil Final Moments, Two Kannada actors died while shooting

Maasti Gudi helicopter stunt goes wrong, two actors drowned, Duniya Vijay escapes.

షూటింగ్ లో మరీ ఇంత నిర్లక్ష్యమా?

Posted: 11/08/2016 08:36 AM IST
Two kannada actors feared drowned after film stunt goes wrong

సినిమా స్టంట్ బిగ్ స్క్రీన్ పై చూసి నోళ్లు తెరుచుకునే మనం వాటి మేకింగ్ వీడియోలు చూసి ఓస్ ఇంతేకదా అనుకున్న రోజులు పోయాయి. ఇప్పుడు ఖచ్ఛితంగా రియాలిటీ కే జనాలు ఓటేస్తున్నారు. తాళ్లు కట్టి డూపులను పెట్టే సంప్రదాయానికి కొందరు హీరోలు కూడా స్వస్తి చేప్పేశారు కూడా. అయితే ఆ ప్రయత్నంలో అప్రమత్తంగా ఉండకపోతే ఏం జరుగుతుందో నిన్న జరిగిన ఉదంతమే ఓ ఉదాహరణ. ఫలితం ఇద్దరు వర్థమాన నటులు ప్రాణాలు కోల్పోయారు.

అసలేం జరిగింది...
కన్నడలో మాస్తిగుడి అనే ఓ సినిమా తెరకెక్కుతుంది. నాగశేఖర దర్శకత్వంలో దునియా విజయ్, అమూల్య హీరోహీరోయిన్లు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం చిత్రీకరించారు. అయితే డూప్ లే కాదు, కనీసం రక్షణ చర్యలు తీసుకోకుండా వారు ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. హెలికాఫ్టర్ నుంచి ముగ్గురు నటులు చెరువులోకి దూకారు. అయితే, ఈ సంఘటనలో హీరో విజయ్ సురక్షితంగా బయటపడగా, ఉదయ్, అనిల్ మాత్రం మృతి చెందారు.

సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఉదయ్, స్టంట్‌మ్యాన్ అనిల్ మొదటగా 50 మీటర్ల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకారు. అయితే వీరికి ఈత రాకపోవడం, రక్షక బోట్లు సరైన సమయానికి రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. హీరో విజయ్ కూడా వారి వెనకే దూకినా అతనికి తెప్ప అందడంతో సురక్షితంగా బయటపడ్డాడు. బురద ఎక్కువగా ఉండటంతో వారి దేహాలు అడుగు భాగంలో చిక్కుకుని పోయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

అదే కారణమా?
అయితే వాళ్లిద్దరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవటమే వారి మృతికి కారణమంటూ ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హీరో అనే ఉద్దేశంతో విజయ్ కి మాత్రమే దానిని ఇచ్చారని, అందుకే మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారంటూ విమర్శిస్తున్నారు.

మరోవైపు ప్రాణాలు విడిచిన నటుడు ఉదయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తలచుకుని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ‘ఇలాంటి స్టంట్ ను నేను చేయడం ఇదే మొదటిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే భయపడే నేను, ఆ దేవుడి దయ వల్ల ఈ స్టంట్ పూర్తి చేస్తానని ఆశిస్తున్నా’ అంటూ కన్నడ న్యూస్ ఛానెల్ ‘సువర్ణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా, 'జక్కన్న', 'బుల్లెట్ రాణి' వంటి తెలుగు చిత్రాల్లో కూడా ఉదయ్ నటించాడు. తాజాగా, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రంలో కూడా ఉదయ్ నటించినట్లు తెలుస్తోంది.

ఇక అనుమతులు లేకుండా షూటింగ్ చేయటమే కాదు, నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు పోయేందుకు కారణమైన మాస్తిగుడి చిత్ర యూనిట్ పై క్రిమినల్ కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles