బాస్-ప్రభాస్ కౌగిలి.. మధ్యలో వర్మ... ఏంటీ కర్మ? | RGV tweets on Baahubali Khaidi meeting

Rgv tweets on baahubali khaidi meeting

RGV baahubali boss, Prabhas Rajamouli RGV, RGV chiru and Prabhas, RGV tweet on chiru and prabhas hug

Director RGV tweets on Baahubali Prabhas meets Chiru in Khaidi no 150 sets.

బాస్-ప్రభాస్ లపై వర్మ ట్వీట్...

Posted: 11/01/2016 12:16 PM IST
Rgv tweets on baahubali khaidi meeting

దర్శకుడు రాంగోపాల్ వర్మకు తన పర తేడా లేదు. ఆగ్రహాం వచ్చినా.. సంతోషం వచ్చినా ఒకేలా రియాక్ట్ అవుతాడు.అయితే అందులో నిగూఢ అర్థాలు వెత్కుకుంటే బూతుల కంటే దారుణంగా ఉంటాయన్నది కొందరు క్రిటిక్స్ చెబుతున్న వాదన. ఒక్కోసారి వారికి కూడా అంతుచిక్కని వ్యాఖ్యలు చేయటం వర్మ స్టైల్. మరి నిన్న రాత్రి ఏం చేశాడో చూస్కోండి.

'మెగా-ప్రభాస్ ల మధ్య ప్రేమ గుండెల్లోంచి వచ్చిందని అనుకుంటే.. వాళ్లు బాహుబలి అయిపోదామని ట్రై చేస్తున్న పిచ్చోళ్ల కింద లెక్క. ఇక ప్రభాస్ ను ప్రేమిస్తాను.. మెగాను ద్వేషంతో కూడిన ప్రేమతో ప్రేమించేందుకు ఇష్టపడతాను.. రాజమౌళితో ప్రేమతో కూడిన ద్వేషాన్ని కోరుకుంటాను' అంటూ అర్ధం అయ్యీ కాకుండా చెప్పడమే కాదు.. 'నిజమైన పిచ్చోళ్లు ఇది అర్ధం చేసుకోలేరు అంటూ తగిలించాడు. ' మెగాకు కాపులపై క్యాస్ట్ ఫీలింగ్ లేనంతగా.. ప్రభాస్ పై నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది.. కానీ దీనికి కమ్మలు మాత్రమే జవాబివ్వాలి' అంటూ ట్వీట్ పెట్టాడు వర్మ.

 

'మెగాస్టార్.. బాహుబలి స్టార్ లకు నిజమైన దేశభక్తి చూపించడానికి కాస్ట్ ఫీలింగ్ సరైన దారి' అన్నాడు వర్మ. మెగాస్టార్.. ప్రభాస్ ల సమానత్వం-అసమానత్వంపై వేదాంతంతో కూడిన ట్వీట్ పెట్టిన ఈ దర్శకుడు 'మెగాస్టార్-ప్రభాస్ ఫ్యాన్స్ లో చాలామందికి spellingకి స్పెల్లింగ్ కూడా తెలీదు కాబట్టి.. నా ఇంగ్లీష్ ని అర్ధం చేసుకోలేకపోయినందుకు వారిని క్షమించేస్తున్నా' అంటూ తన వేదాంతాన్ని ముగించాడు వర్మ.

ఇంతకీ వర్మ చెప్పిదాంట్లో అర్థం ఏమైనా అర్థమైతే, అర్థం చేసుకుని ఆవళింపు చేసుకోండి. అర్థం కాకపోతే అర్థం చేసుకునేందుకు ట్రై చేయండి. అంతేగానీ పెడర్థాలు మాత్రం తీయకండి. ఎందుకంటే వర్మ చేసింది ముమ్మాటికీ పొగడ్తే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  chiru  prabhas  meet  hug  baahubali  khaidi no 150  

Other Articles