మహేష్ మూవీ చాలా టైం ఉందంట... | mahesh movie first look after title only

Mahesh movie first look after title only

mahesh murugadoss title, why mahesh miss the title, mahesh movie title, mahesh murugadoss no title, after title fix mahesh look reveal

mahesh murugadoss movie first look after fixation of title only.

వాయిదాకు కారణం ఉంది కదా!

Posted: 10/31/2016 09:14 PM IST
Mahesh movie first look after title only

మహేష్‌బాబు-మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌గానీ, అఫీషియల్‌ అప్‌డేట్‌గానీ ఏమీ వెలువడకున్నా మహేష్‌ అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళికి మహేష్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి అభిమానుల్ని ఖుషీ చేయాలని చిత్రయూనిట్‌ భావించింది. అందుకు ఏర్పాట్లు కూడా జరిగినట్టు కథనాలు వచ్చాయి.

కానీ, దీపావళి రోజున అలాంటిదేమీ విడుదల కాలేదు. సినిమా టైటిల్‌పై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం వల్లే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. మురుగదాస్‌ దర్శకత్వంలో ద్విభాష (తెలుగు-తమిళ) చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పలు టైటిళ్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మెజారిటీ చిత్రయూనిట్‌ మాత్రం 'ఏజెంట్‌ శివ' టైటిల్‌కు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఒక్కసారి సినిమా టైటిల్‌పై స్పష్టత వస్తే వెంటనే ఫస్ట్‌లుక్‌ విడుదల చేయవచ్చునని వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. పూర్తిగా సరికొత్త రీతిలో ఈ సినిమాలో మహేష్‌ పాత్రను మురుగదాస్‌ తీర్చిదిద్దాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్‌లుక్‌ విషయంలో త్వరలోనే మహేష్‌ అభిమానుల ఎదురుతెన్నులు ముగిసే అవకాశముందని ఆ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  murugadoss movie  first look  title  

Other Articles