పవన్ సినిమాపై సరికొత్త డౌట్ | Pawan walk out from Katamarayudu sets, Two getups in that Movie.

Pawan kalyan katamarayudu updates

Pawan Kalyan Two Avatars in Katamarayudu, Pawan walkout from Katamarayudu sets, Katamarayudu shelved, Pawan Dolly clash, Pawan quit Katamarayudu sets

Pawan Kalyan Two Avatars in Katamarayudu. News viral that Pawan walkout from sets due to clash with Director Dolly.

కాటమరాయుడి అప్ డేట్స్

Posted: 10/26/2016 11:49 AM IST
Pawan kalyan katamarayudu updates

ఓవైపు పవన్ కళ్యాణ్ కాటమరాయడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వేళ పవన్ అభిమానులను కలవరపెట్టే ఓ వార్త వైరల్ అవుతోంది. పవన్ సెట్స్ నుంచి వాకౌట్ అయ్యాడనే వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. తమిళ హిట్ చిత్రం వీరంకి రీమేక్ గా రాబోతున్న కాటమరాయుడు ప్రస్తుతం ఆర్ఎఫ్ సీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఓ సన్నివేశ విషయమై దర్శకుడు డాలీపై పవన్ విభేదించి  ఒకింత అసహనానికి గురై గట్టిగానే అరచి, సెట్స్ నుంచి వెళ్లిపోయాడని అందులో సారాంశం.

వెంటనే రంగంలోకి దిగిన శరత్ మరార్ ఈ విషయంలో పవన్ ని బుజ్జగించే యత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంకోవైపు మొదటి వారం లోపు ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని అనంతపురం సభలో పాల్గొనాలని పవన్ ఫుల్ ప్రిపరేషన్ లో ఉండగా, ఇలా జరగటంతో అయోమయం నెలకొంది. ఏది ఏమైనా చిత్ర యూనిట్ అఫీషియల్ ఇటువంటి విషయాల్లో స్పందించదు గనక మళ్లీ షూటింగ్ కు హాజరయ్యేదాకా అందరిలోనూ టెన్షన్ నెలకొన్నట్లే.

ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ అందింది. సినిమా మొత్తం పవన్ పంచెకట్టులోనే కనిపిస్తాడని తొలుత చెప్పుకున్నాం. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాసేపు పవన్ స్టైలిష్ అవతారంలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కానీ, మాతృక ఇటువంటి ఎపిసోడ్స్ ఎక్కడా ఉన్న ధాఖలాలు లేకపోవటంతో అభిమానుల కోసమే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan Kalyan Walk out  Clash with Dolly  Pawan Dolly clash  

Other Articles