బాహుబలి-3 అన్న భ్రమలో ఉందా? | Prabhas to Romance Parineeti Chopra for sujeeth movie

Parineeti chopra for prabhas sujeeth movie

Parineeti Chopra giving nod for prabhas movie, Parineeti Chopra Prabhas, Prabhas Parineeti Chopra Movie, Parineeti that is not Baahubali 3, Parineeti Chopra for prabhas-sujeeth movie, this bollywood actress finalised for Prabhas new movie

Parineeti Chopra giving nod for prabhas-sujeeth movie.

కొంపదీసి అది బాహుబలి అనుకుంటుందా?

Posted: 10/25/2016 01:30 PM IST
Parineeti chopra for prabhas sujeeth movie

బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టును పూర్తిగా సౌత్ వాళ్లతో తీసినప్పటికీ అందులో ఉన్న కంటెంట్, విజువల్ వర్క్స్ జనాలందరికీ ఎక్కేస్తాయన్న నమ్మకంతోనే భారీ సినిమాను అంతే భారీ లెవల్లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అలా అన్ని ప్రాజెక్టులకు కుదురుద్దా అంటే రాజమౌళియే కాదని చెప్పేశాడు. అదలా ఉంచితే బాహుబలితో ఎక్కువగా లాభపడిందంటే నిర్మాతల కంటే ప్రభాస్ అనే చెప్పుకోవాలి.

పద్నాలుగేళ్ల ఇండస్ట్రీలో ప్రభాస్ కు రానీ క్రేజ్ ఒక్క సినిమాతో వరల్డ్ వైడ్ గా వచ్చేసింది. కేవలం మాన్లీ హీరో అనే తప్ప, నటనపరంగా ప్రభాస్ నటించిన ఏ సినిమాకు కూడా అంతగా గుర్తింపు రాలేదని క్రిటిక్స్ విమర్శిస్తుంటారు కూడా. అయితే బాహుబలి ఆ ఈమేజ్ ను పూర్తిగా కప్పేసింది. దీంతో ఇప్పటిదాకా ప్రభాస్ గురించి ఏమీ తెలియని హీరోయిన్లు కూడా మోస్ట్ వాంటెడ్ హీరోగా ఫిక్స్ చేసుకుని అతని సరసన నటించేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు పరిణితి చోప్రా కూడా వచ్చి చేరింది.
 
సుజీత్ తో సినిమా 50 నుంచి 150 కోట్లకు బడ్జెట్ మారగనే అది నేషనల్ లెవల్ ప్రాజెక్టు అయిపోయిందని అర్థమౌతోంది. ఆ లెక్కన ప్రభాస్ పక్కన ఖచ్ఛితంగా ఆ స్థాయి హీరోయిన్ నే పెట్టాలి. అందుకే బాలీవుడ్ సుందరి పరిణితి చోప్రాను అప్రోచ్ కావటం, ఆ బ్యూటీ ఓకే చేయటం జరిగిపోయిందనేది యూవీ క్రియేషన్స్ నుంచి అందుతున్న సమాచారం. అయితే గతంలో మహేష్, ఎన్టీఆర్ లాంటి యాక్టింగ్ స్కోప్ హీరోల పక్కన భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సరే నటించేందుకు సారీ చెప్పిన పరిణితి ఇప్పుడు ప్రభాస్ కి ఓకే చెప్పటం పెద్ద వింత కాకపోవచ్చు. కానీ, పరిణితి ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తీయబోయేది బాహుబలి కాదు... ఓ సాదాసీదా యాక్షన్ డ్రామా అని...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Parineeti Chopra  Sujeeth movie  

Other Articles