బిజీ పబ్ లో రెచ్చిపోయిన అనసూయ, రకుల్ | Rakul Preet Singh Anasuya Date with programme in Pub

Rakul date with anasuya in a pub

Date with Anasuya, Anasuya Over Action in Date with Anasuya, Date with Anasuya Rakul, Rakul Anasuya in Pub, Anasuya hot in Date with Anasuya programme

Rakul Preet Singh's super duper masti date with Anasuya in a Pub.

పబ్ లో హాట్ యాంకర్ అండ్ హీరోయిన్ రచ్చ

Posted: 10/25/2016 12:33 PM IST
Rakul date with anasuya in a pub

యాంకర్ నుంచి నటిగా మారాక కూడా అనసూయ తన బుద్ధిని పోనీచ్చుకోవట్లేదు. కన్ఫూజ్య్ కాకండి చెప్పేది ఆమె గ్లామర్ అండ్ పెర్ ఫార్మెన్స్ స్కిల్స్ గురించి... సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నా సరే ఇటు టీవీషోలలో కూడా రచ్చ చేస్తూనే ఉంది. ఓ ప్రముఖ ఛానెల్ కోసం డేట్ విత్ అనసూయ అనే షో చేస్తున్న ఆమె టాప్ స్టార్ల మనోగతాలతో సందడి చేస్తోంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది దాని గురించే.

ఈ షోలో భాగంగా తాజా ఎపిసోడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పై చిత్రీకరించారు. హైదరాబాద్ లోని ఓ బిజీ పబ్ లో డే టైం ఈ షోని నిర్వహించారు. మందు సెటప్ ముందు కూర్చున్న రకుల్, అనసూయలు చేతిలో మందు గ్లాసులతో సందడి చేశారు. (కేవలం పట్టుకున్నారంతే...). సినిమాల దగ్గరి నుంచి వ్యక్తిగత అంశాల దాకా అనసూయ అన్నీ అడుగుతుంటే రకుల్ చకచకా సమాధానం చెప్పుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్.. కాబోయే వాడు ఇలా కాస్త లోతైన అంశాలను కూడా అనసూయ అడిగింది లేండి. ఇక అక్కడే ఉన్న స్టాఫ్ తోపాటు కొంత మంది అభిమానులు కూడా వారి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడిపోయారు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రాంచరణ్ సరసన ధ్రువలో నటిస్తుండగా, కోలీవుడ్ లో మరో బడా ప్రాజెక్టు కోసం సిద్ధమౌతున్నట్లు సమాచారం.  ఇక అనసూయ విషయానికొస్తే... క్షణం తమిళ రీమేక్ లో కూడా పోలీసాఫీసర్ పాత్రకు ఓకే చెప్పిందట. సత్యరాజ్ (కట్టప్ప) కొడుకు శిబిరాజ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అదాశర్మనే తీసేసుకున్నాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Date with Anasuya  Rakul Preet Singh  

Other Articles