కాటమరాయుడికి ఆరోజే ఎందుకు ఫిక్స్ చేశారో తెలుసా? | Pawan Kalyan Katamarayudu on Ugadi.

Pawan katamarayudu release date fixed

Pawan kalyan's Katamarayudu release date on Ugadi Eve, Katamarayudu Release Date, Pawan in Ugadi race, PK's Katamarayudu release date, Katamarayudu release date on March 29th 2017

Why Pawan kalyan's Katamarayudu release date on Ugadi Eve.

పవన్ పండగకే ఎందుకు వస్తున్నాడు?

Posted: 10/25/2016 08:43 AM IST
Pawan katamarayudu release date fixed

ప్రస్తుతం పవర్ స్టార్ మల్లీ ప్రాజెక్టులతో బిజీ కాబోతున్నాడు. కమిట్ అయిన చిత్రాలను త్వరగతిన పూర్తి చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయంగా బిజీ అయిపోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే కాటమరాయుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, మొన్నే ఏం ఎం రత్నం ప్రాజెక్టుకు కొబ్బరికాయను కొట్టేశాడు. ఇక డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ ను, ఆపై దాసరి (బోస్ టైటిల్ అనుకుంటున్నారు) చిత్రాన్ని మొదలుపెట్టి వచ్చే ఏడాది సెకండాఫ్ లోపు అన్నింటిని పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం డాలీ తో కాటమరాయుడు తీస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ చిత్రం వీరంకి రీమేక్ గా రాబోతున్న ఈ చిత్రంలో పవన్ ఓ పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించబోతున్నాడు. శృతీహాసన్ హీరోయిన్ గా నటించబోతుండగా, పీకే స్నేహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నాడు. నలుగురు తమ్ముళ్ల కోసం పెళ్లిని త్యాగం చేసి ఊరి కోసం పాటుపడే పాత్రను పవన్ పోషిస్తున్నాడు.

ఇక వచ్చే యేడాది మార్చి 29న ఉగాదిని పురస్కరించుకొని చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని సమాచారం. ఈమేరకు దర్శకనిర్మాతలు ఆ డేట్ నే లాక్ చేసేసి మీడియాకి తెలిపారు. కలెక్షన్లకి మంచి సీజన్ కావటంతో కాటమరాయుడు కుమ్ముకోని కొత్త రికార్డులు క్రియేట్ చేయొచ్చనే భావించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  katamarayudu  release date  March 29th 2017  Ugadi  

Other Articles