ప్రభాస్ పై ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడంటే... | Sujeeth special wishes on Prabhas's Birthday

Sujeeth special wishes on prabhas s birthday

Sujeeth wishes Prabhas Birthday, Sujeeth tweet for Prabhas Birthday, Prabhas Sujeeth, Sujeeth sweet revenge on Prabhas, Prabhas special birthday wishes, Sujeeth Prabhas movie budget 150 crores

Director Sujeeth's special birthday wishes tweet to Prabhas

ప్రభాస్ పై ప్రతీకారం మాములుగా ఉండదట!

Posted: 10/24/2016 10:15 AM IST
Sujeeth special wishes on prabhas s birthday

రన్ రాజా రన్ లాంటి స్టైలిష్ హిట్ తర్వాత కేవలం ప్రభాస్ కోసమే కాచుకుని కూర్చున్నాడు దర్శకుడు సుజీత్. బాహుబలి పేరిట 5 ఏళ్లు అందులోనే మునిగిపోయిన యంగ్ రెబల్ స్టార్ నే తన సెకండ్ మూవీలో డైరక్ట్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఫస్ట్ పార్ట్ తర్వాత కాస్త గ్యాప్ ఇస్తే అందులో దూరిపోయి కానిచ్చేదామనుకున్నాడు. కానీ, అందుకు అవకాశం ఇవ్వలేదు ప్రభాస్.

వెంటే కంక్లూజన్ పై పడిపోయాడు. ఏదైతేనేం ఎట్టకేలకు ఇంకో రెండు నెలలో పూర్తిగా జక్కన్న చెర నుంచి విముక్తి కాబోతున్నాడు. ఈ దశలో సుజీత్ తన స్క్రిప్ట్ ను తెరపై పెట్టేందుకు రెడీ అయిపోతున్నాడు. ఇక బాహుబలి 2 కోసం ప్రభాస్ శివుడి లుక్ పై దేశం అంతా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలువురు ప్రముఖులు కూడా నిన్న ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. అందులో సుజీత్ మిస్సవుతాడని ఎవరైనా అనుకుంటారా?

‘‘హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అన్న. ఏడాదిన్నరగా నన్ను నమ్ముతూ వస్తున్నందుకు థాంక్స్. దానికి బదులుగా నేను ఏదైనా ఇవ్వాలిగా. అందుకే సినిమా రూపంలో దానికి రెట్టింపు నీకు ఇస్తాను’’ అంటూ ట్వీట్ చేశాడు. బావుంది కదా సుజీత్ స్వీట్ ప్రతీకారం. ఇక తొలుత 50 కోట్లు బడ్జెట్ అని ప్రకటించిన యూవీ క్రియేషన్స్ సుజీత్ పై నమ్మకం పెరిగిపోవటం, ప్రభాస్ క్రేజ్ ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ను 150 కోట్లకు పెంచినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas birthday  Sujeeth tweet  special wishes  

Other Articles