భక్తుడితో సెల్ఫీ పోలా... అదిరిపోలా... | Nagarjuna selfie with sourabh Jain.

Nag selfie with sourabh jain

Nagarjuna selfie with sourabh Jain, Nagarjuna selfie, Nag Selfie, Akkineni Nagarjuna selfie, Nag selfie with God, Devotee Selfie with God, Hathiram selfie with Lord Venkatesa, Screen God selfie with Nag, Nag selfie with Sourabh, God selfie with Devotee

Nagarjuna selfie with sourabh Jain in Om Namo Venkatesaya shooting viral

దేవుడితో సెల్ఫీనా టూమచ్ కాదా?

Posted: 10/22/2016 10:51 AM IST
Nag selfie with sourabh jain

సెల్ఫీ పైత్యం సెలబ్రిటీలకు కూడా పాకిపోయింది. సినిమాల కోసం కుర్ర హీరోలే కాదు.. ట్రెండ్ కు తగ్గట్లు సీనియర్ హీరోలు కూడా ఆ వ్యాపకాన్ని వాడేసుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి చేరిపోయాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఆయన దిగిన ఓ సెల్పీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఇంతకీ ఆయన దిగింది ఎవరితో అనుకుంటున్నారు. బాలీవుడ్ హీరో సౌరభ్ జైన్.

ప్రస్తుతం దర్శకేంద్రుడి దర్శకత్వంలో నాగ్ వెంకటేశ్వరస్వామి భక్తుడు హథీరామ్ బాబా పై తెరకెక్కుతున్న ఓం నమో వేంకటేశాయ: చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ ముప్పై ఏళ్ల బాలీవుడ్ మోడల్ అండ్ నటుడు సౌరభ్ వెంకటేశ్వరుడిగా కనిపించబోతున్నాడు. డజనుకు పైగా సీరియల్స్ తోపాటు, రెండు మూడు చిత్రాల్లో నటించిన సౌరవ్ తో షూటింగ్ లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని నాగ్ చెబుతున్నాడు.

ఆ మధ్య జైన్ లుక్ రివీల్ చేసిన యూనిట్ ఆ తర్వాత అనుష్క, నాగ్ లుక్స్ ని కూడా విడుదల చేసింది. ఇక మహాబలేశ్వరంలో షూటింగ్ జరుపుకున్న చిత్ర యూనిట్ తాజాగా ప్యాకప్ చెప్పి హైదరాబాద్ కి చేరుకుంది. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. ప్యాకప్ చెప్పిన తర్వాత సౌరభ్ జైన్, నాగార్జున కలిసి సరదాగా ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను సౌరభ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఈ సెల్ఫీకి వెరైటీ కామెంట్స్ వస్తున్నాయి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది సెల్ఫీ, భక్తుడితో భగవంతుడి సెల్ఫీ అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Akkineni Nagarjuna  Selfie  Sourabh Jain  

Other Articles