బాస్ కౌగిలిలో బాహుబలి ఎంత బావుందో | Baahubali Prabhas meets Chiru in Khaidi sets.

Prabhas meets chiru in khaidi sets

prabhas hug chiru, Chiru Hug Prabhas, Baahubali meets Khaidi, Khaidi meets baahubali, Prabhas and Rajamouli in Khaidi No.150 sets, special guest in Khaidi No 150, Khaidi no.150 news, Chiru 150 movie updates

Baahubali Prabhas along director Rajamouli meets Megastar Chiranjeevi in Khaidi sets.

ఖైదీతో కౌగిలిలో బాహుబలి సూపర్

Posted: 10/22/2016 08:43 AM IST
Prabhas meets chiru in khaidi sets

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు హీరోయిజం అంటే ఏంటో తెలిపిన ఓ నటుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి సీనియర్లు టాలీవుడ్ ను ఏలి రిటైర్ మెంట్ అవుతున్న తరుణంలో వచ్చి, తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించాడు. డాన్సులు, ఫైట్లు ఓవరాల్ గా ఓ స్టైల్ ను క్రియేట్ చేసి పడేశాడు. తొమ్మిదేళ్ల తర్వాత వన్నె తగ్గని క్రేజీతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు.

ఇక పద్నాలుగేళ్లుగా మాస్ హీరోగా ఉన్న ప్రభాస్ కి మిర్చితో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ వెంటనే బాహుబలి లాంటి ప్రెస్టీజీయస్ ప్రాజెక్టు చేయటంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. తెలుగు సినిమాను చరిత్ర పుటలో కెక్కించిన చిత్రంలో హీరోగా గుర్తింపు పొందాడు. ఈ ఇద్దరు అసలు ఎప్పుడు కలిశారనేగా మీ అనుమానం.

బాహుబలి-2 కి రంగం సిద్ధం అవుతున్న వేళ ఖైదీ సెట్ లో ఆ చిత్ర యూనిట్ సందడి చేసింది. దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ లు చిరు ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చారు. డార్లింగ్ ను చూసిన వెంటనే మురిసిపోయిన చిరు ఆత్మీయంగా కౌగిలించేసుకున్నాడు. అన్నట్లు తన ఫేవరెట్ హీరో ఎవరంటే వారసత్వ బుద్ధి చూపించకుండా, మెగాస్టార్ అని తడబడకుండా చెప్పేస్తుంటాడు ప్రభాస్. అందుకేనేమో అలా ఆత్మీయ ఆలింగనం చేసేకున్నాడు. ఆ సీన్ చూసి పక్కనే ఉన్న జక్కన్న ఎలా మురిసిపోతున్నాడో చూడండి. ఆ మాటకొస్తే మనకి కూడా సేమ్ ఫీలింగ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Chiranjeevi  Hug  150 movie  khaidi No.150  

Other Articles