ధ్రువ లేట్ అందుకన్న మాట | ram charan dhruva release date fix

Ram charan dhruva release date fix

Dhruva release date, ram charan dhruva release, December 2nd fix for mega fans, Dhruva date

ram charan dhruva release date fix on December 2nd.

ధ్రువ రిలీజ్ తేదీ ఫిక్స్ చేసేశారా?

Posted: 10/17/2016 11:00 AM IST
Ram charan dhruva release date fix

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధ్రువ విషయంలో నెలకొన్న సస్పెన్స్ లు మెల్లిగా వీడిపోతున్నాయి. దసరా కి విడుదల చేసిన ధ్రువ టీజర్ కి 24 గంటలు తిరక్క ముందే మిలియన్ వ్యూవ్స్ రావటం, పైగా అందులో ఇంటెన్సిటి అదిరిపోవటంతో సినిమా హిట్ ఖాయమని మెగా అభిమానులు ఫిక్సపోతున్నారు. కానీ, ఒక్క విషయంలో మాత్రం ఇంతదాకా సైలెన్స్ మెయింటెన్ చేసింది చిత్ర యూనిట్.

తొలుత ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం దసరాకే వస్తుందని అంతా అనుకున్నారు. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డితో చెర్రీకి చెడిందని, ఔట్ పుట్ నచ్చకపోవటంతోనే మళ్లీ రీషూట్ చేశారని ఇలా రకరకాల వదంతులు వ్యాపించాయి. కానీ, అదంతా ఉత్తదేనని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇండైరక్ట్ గా చెప్పేసింది. క్వాలిటీ కోసమే షూటింగ్ ఇంత ఆలస్యం అయ్యిందని చెప్పుకోచ్చింది. టీజర్ చూసిన ఎవరైనా ఆ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. ప్రస్తుతం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని, ఈ నెలలో అది కూడా పూర్తి చేసి వచ్చే నెల మొత్తం ప్రమోషన్ తోనే గడిపేస్తారంట.

తమిళ్ రీమేక్ ను తెలుగు నేటివిటికి తగ్గట్లుగానే మార్చినట్లు చెప్పిన అల్లు అరవింద్ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాలని డిసైడ్ అయిపోయారంట. ఇప్పటికే చాలా డిలే అయిన ఈ స్టైలిష్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయొద్దన్న భావనలో ఉన్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva movie  release date  

Other Articles