సూపర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ | Robo 2.0 teaser released on november 20

Robo 2 0 teaser released on november 20

Robo 2.0 teaser, rajanikanth robo sequel, november 20th Rajani treat

Robo 2.0 teaser released on november 20.

నవంబర్ 20న తలైవా ట్రీట్

Posted: 10/15/2016 10:20 AM IST
Robo 2 0 teaser released on november 20

తలైవా తెరపై రోబో గా మరోసారి శంకర్ దర్శకత్వంలో రాబోతున్నాడని తెలిసిందే. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో 'రోబో 2.0' చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే షూటింగ్ ఆఖరికి దశకు చేరిన ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను .. ఒక పాటను చిత్రీకరించారు. రిలీజ్ కు చాలా టైం ఉండటంతో ఇప్పుడు ఫస్టులుక్ కోసం .. ఫస్టు టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వారందరి కోరికను తీరుస్తూ లైకా ప్రొడక్షన్ వారు ఓ అనౌన్స్ మెంట్ చేశారు. నవంబర్ 20వ తేదీన ఫస్టులుక్ ను .. టీజర్ ను వదలడానికి రంగం సిద్ధమైంది. ఈ తేదీన ఇవి రానున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే వార్తలు షికారు చేశాయి. అదే తేదీని తాజాగా ఈ సినిమా టీమ్ ఖరారు చేసింది. ఇప్పటికే బడ్జెట్ పరంగా .. భారీ తారాగణం పరంగా .. భారీస్థాయి గ్రాఫిక్స్ పరంగా ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి. ఇక ఫస్టు టీజర్ తరువాత ఏ స్థాయిలో అంచనాలు పెరుగుతాయో చూడాలి.

ఇక ఈ సినిమా కోసం రజనీ సైంటిస్ట్ గెటప్ కి కొత్త మేనరిజంను పెట్టబోతున్నారంట. కొరియా నుంచి తెచ్చిన సూపర్ ఫైటర్లతో ఈ మధ్యే ఓ యాక్షన్ సీన్ ను తీసినట్లు సమాచారం. భారీ తనం ఏ మాత్రం మిస్ కాకుండా సినిమాను ప్రజెంట్ చేయబోతున్నాడు ఇండియన్ స్పీల్ బర్గ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  Robo 2  firstlook  teaser  

Other Articles